IPL 2024: ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్ చిత్తు.. ఛాంపియన్స్‌గా కేకేఆర్‌ | Sakshi
Sakshi News home page

IPL 2024: ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్ చిత్తు.. ఛాంపియన్స్‌గా కేకేఆర్‌

Published Sun, May 26 2024 7:05 PM

IPL 2024 Final: Sunrisers hyderabad vs Kolkata Knight Riders Highlights and live Updates

IPL 2024 SRH vs KKR Final Live Updates: 

ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్ చిత్తు.. ఛాంపియన్స్‌గా కేకేఆర్‌
ఐపీఎల్‌-2024 ఛాంపియన్స్‌గా కోల్‌కతా నైట్‌రైడర్స్ నిలిచింది. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను  చిత్తు చేసిన కేకేఆర్‌.. ముచ్చటగా మూడో సారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఏక పక్షంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో కేకేఆర్ ఘన విజయం సాధించింది. 

114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్‌(52 నాటౌట్‌) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 

అ‍ంతకుముందు బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, ఆరోరా ఆరంభంలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్‌ మూడు వికెట్లతో ఆరెంజ్‌ ఆర్మీ పతనాన్ని శాసించాడు.

 వీరిద్దరితో పాటు సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్‌ సాధించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌(24) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మార్‌క్రమ్‌(20), క్లాసెన్‌(16) పరుగులు చేశారు.

కుప్పకూలిన ఎస్‌ఆర్‌హెచ్‌..
టైటిల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్‌ఆర్‌హెచ్ కేకేఆర్ బౌలర్ల దాటికి గజగజ వణికింది. కేకేఆర్ బౌలర్లు చెలరేగడంతో సన్‌రైజర్స్ కేవలం 113 పరుగులకే కుప్పకూలింది. కేకేఆర్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, ఆరోరా ఆరంభంలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్‌ మూడు వికెట్లతో ఆరెంజ్‌ ఆర్మీ పతనాన్ని శాసించాడు.

 వీరిద్దరితో పాటు సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్‌ సాధించారు. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌(24) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మార్‌క్రమ్‌(20), క్లాసెన్‌(16) పరుగులు చేశారు.

అయ్యర్‌, గుర్బాజ్ విధ్వంసం..
అనంతరం 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కేకేఆర్ 10.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి ఛేదించింది. కేకేఆర్ బ్యాటర్లలో ఓపెనర్ గుర్భాజ్ (39) పరుగులు చేయగా.. ఫస్ట్ డౌన్ బ్యాటర్ వెంకటేశ్ అయ్యర్‌(52 నాటౌట్‌) హాఫ్ సెంచరీతో చెలరేగాడు.

కేకేఆర్‌ రెండో వికెట్‌ డౌన్‌..

గుర్బాజ్ రూపంలో కేకేఆర్ రెండో వికెట్ కోల్పోయింది. 39 పరుగులు చేసిన గుర్భాజ్‌.. షాబాజ్ అహ్మద్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కేకేఆర్ విజయానికి ఇంకా 8 పరుగులు కావాలి.
విజయం దిశగా కేకేఆర్‌..
114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఆడుతోంది. 6 ఓవర్లు మగిసే సరికి వికెట్ నష్టానికి కేకేఆర్ 72 పరుగులు చేసింది. క్రీజులో గుర్భాజ్‌(21), వెంకటేశ్ అయ్యర్‌(40) పరుగులతో ఉన్నారు.

తొలి వికెట్‌ డౌన్‌..
114 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ తొలి వికెట్ కోల్పోయింది. 6 పరుగులు చేసిన సునీల్ నరైన్.. కమ్మిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 3 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది.
113 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన ఎస్ఆర్‌హెచ్‌
చెపాక్‌ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లు దారుణ ప్రదర్శన కనబరిచారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌.. కేకేఆర్‌ బౌలర్ల దాటికి 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. 

కేకేఆర్‌ పేసర్లు మిచెల్‌ స్టార్క్‌, ఆరోరా ఆరంభంలోనే ఎస్‌ఆర్‌హెచ్‌ దెబ్బతీయగా.. ఆ తర్వాత రస్సెల్‌ మూడు వికెట్లతో ఆరెంజ్‌ ఆర్మీ పతనాన్ని శాసించాడు. వీరిద్దరితో పాటు సునీల్‌ నరైన్‌, వరుణ్‌ చక్రవర్తి, ఆరోరా తలా వికెట్‌ సాధించారు. 

ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌(24) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మార్‌క్రమ్‌(20), క్లాసెన్‌(16) పరుగులు చేశారు. కాగా ఐపీఎల్ చరిత్రలో ఇదే లోయెస్ట్ టార్గెట్ కావడం గమనార్హం.

16 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్‌: 98/8
ఎస్ఆర్‌హెచ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 16 ప‌రుగులు చేసిన క్లాసెన్‌.. హర్షిత్ రానా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు. క్రీజులో ఉన‌ద్క‌ట్ వ‌చ్చాడు. 16 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్‌: 98/8

పీకల్లోతు కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌.. 77 పరుగులకే 7 వికెట్లు
ఎస్ఆర్‌హెచ్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. 77 ప‌రుగుల‌కే స‌న్‌రైజ‌ర్స్‌ 7 వికెట్లు కోల్పోయింది. చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో షాబాజ్ అహ్మ‌ద్ ఔట్ కాగా.. ర‌స్సెల్ బౌలింగ్‌లో ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా వ‌చ్చిన స‌మ‌ద్ సైతం ఔట‌య్యాడు. క్రీజులో క్లాసెన్‌(13), కమ్మిన్స్ 4 పరుగులతో ఉన్నారు. 13 ఓవర్లకు ఎస్‌ఆర్‌హెచ్ స్కోర్‌: 82/7

పీకల్లోతు కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్‌.. 62 పరుగులకే 5 వికెట్లు
62 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 20 పరుగులు చేసిన మార్‌క్రమ్‌.. రస్సెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి షాబాజ్ అహ్మద్ వచ్చాడు.

నాలుగో వికెట్‌ డౌన్‌
నితీష్‌ కుమార్‌ రెడ్డి రూపంలో ఎస్‌ఆర్‌హెచ్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. 13 పరుగులు చేసిన నితీష్‌ కుమార్‌.. హర్షిత్‌ రానా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

క‌ష్టాల్లో ఎస్ఆర్‌హెచ్‌.. 21 ప‌రుగుల‌కే 3 వికెట్లు
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్‌ కష్టాల్లో పడింది. 21 పరుగుల వద్ద ఎస్‌ఆర్‌హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 9 ప‌రుగులు చేసిన రాహుల్ త్రిపాఠి.. స్టార్క్ బౌలింగ్‌లో ఔట‌య్యాడు.

హెడ్‌ ఔట్‌..
ట్రావిస్ హెడ్ రూపంలో ఎస్ఆర్‌హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. ట్రావిస్ హెడ్ గోల్డెన్ డ‌క్‌గా వెన‌దిరిగాడు. వైబవ్ ఆరోరా బౌలింగ్‌లో హెడ్.. వికెట్ కీప‌ర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరాడు. 

3 ఓవ‌ర్లు ముగిసే స‌రికి స‌న్‌రైజ‌ర్స్ రెండు వికెట్లు న‌ష్టానికి 15 ప‌రుగులు చేసింది. క్రీజులో రాహుల్ త్రిపాఠి(7), మార్‌క్ర‌మ్‌(4) ప‌రుగుల‌తో ఉన్నారు.

ఎస్ఆర్‌హెచ్‌కు బిగ్ షాక్‌.. అభిషేక్ ఔట్‌
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్‌హెచ్‌కు ఆదిలోనే బిగ్ షాక్ త‌గిలింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ వికెట్‌ను ఎస్ఆర్‌హెచ్ కోల్పోయింది. 2 ప‌రుగులు చేసిన అభిషేక్ శ‌ర్మ‌.. స్టార్క్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ‌య్యాడు.

ఐపీఎల్‌-2024లో ఫైన‌ల్ పోరుకు రంగం సిద్ద‌మైంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక‌గా ఫైన‌ల్ మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌తున్నాయి. ఈ టైటిల్ పోరులో టాస్ గెలిచిన ఎస్ఆర్‌హెచ్ తొలుత‌ బ్యాటింగ్ ఎంచుకుంది.

ఈ మ్యాచ్‌లో కేకేఆర్ ఎటువంటి మార్పులు లేకుండా బ‌రిలోకి దిగ‌గా.. ఎస్ఆర్‌హెచ్ ఒకే ఒక మార్పు చేసింది. తుది జ‌ట్టులోకి స‌మ‌ద్ స్ధానంలో ఆల్‌రౌండ‌ర్‌ షాబాజ్ అహ్మద్ వ‌చ్చాడు.

తుది జ‌ట్లు
కోల్‌కతా నైట్ రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీప‌ర్‌), సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్‌), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చ‌క్ర‌వ‌ర్తి

సన్‌రైజర్స్ హైదరాబాద్‌: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్, నితీష్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్(వికెట్ కీప‌ర్‌), షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), భువనేశ్వర్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, టి నటరాజన్

Advertisement
 
Advertisement
 
Advertisement