
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా ఎస్‌ఆర్‌హెచ్, రాజస్తాన్ మ్యాచ్‌లో స్టన్నింగ్ క్యాచ్ నమోదైంది. ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో ఇది చోటుచేసుకుంది. బౌల్డ్ వేసిన ఔట్ స్వింగర్‌ను అవనసరంగా గెలుక్కున్న రాహుల్ త్రిపాఠి మూల్యం చెల్లించుకున్నాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తాకింది. కీపర్‌కు, స్లిప్ ఫీల్డర్‌కు మధ్య గ్యాప్‌లో వెళ్తున్న బంతిని జేసన్ హోల్డర్ ఎడమవైపుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు.
అయితే త్రిపాఠి రివ్యూకు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు. బ్యాట్‌కు బంతి క్లియర్‌గా తగిలిందని తెలుస్తున్నా అనవసరంగా రివ్యూకు వెళ్లి పరువు తీసుకున్నాడు. బౌల్ట్ వేసిన బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తాకి బౌన్స్ అయినప్పటికి.. అయితే బంతి బ్యాట్‌ను తగల్లేదనే ఉద్దేశంతో త్రిపాఠి రివ్యూకు వెళ్లి ఉంటాడు. ఇక జేసన్ హోల్డర్ క్యాచ్ సీజన్ ఆఫ్ ది క్యాచ్‌గా నమోదైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియలో వైరల్‌గా మారింది.
Trent Boult is a beast in the Powerplay. pic.twitter.com/0nRX2295wc
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2023