IPL 2023: Rajasthan Royals Vs LSG Match Live Updates - Sakshi
Sakshi News home page

IPL 2023: రాజస్తాన్‌పై 10 పరుగుల తేడాతో లక్నో విజయం

Apr 19 2023 7:09 PM | Updated on Apr 19 2023 11:22 PM

IPL 2023: Rajasthan Royals Vs LSG Match Live Updates - Sakshi

లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 10 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. జైశ్వాల్‌ 44,  బట్లర్‌ 40 మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు.  లక్నో బౌలర్లలో ఆవేశ్‌ ఖాన్‌ మూడు వికెట్లతో మెరవగా.. స్టోయినిస్‌ రెండు వికెట్లు తీశాడు.

18 ఓవర్లలో రాజస్తాన్‌ 126/4

18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్‌ రాయల్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. పడిక్కల్‌ 24, రియాన్‌ పరాగ్‌ మూడు పరుగులతో ఆడున్నారు. రాజస్తాన్‌ విజయానికి 12 బంతుల్లో 29 పరుగులు కావాలి.

శాంసన్‌ రనౌట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌
40 పరుగులు చేసిన బట్లర్‌ భారీ షాట్‌కు యత్నించి స్టోయినిస్‌ బౌలింగ్‌లో బిష్ణోయికి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో రాజస్తాన్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. అంతకముందు సంజూ శాంసన్‌ రనౌట్‌ అయి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ స్కోరు మూడు వికెట్ల నష్టానికి 98 పరుగులుగా ఉంది

తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌
లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 44 పరుగులతో మంచి టచ్‌లో కనిపించిన యశస్వి జైశ్వాల్‌ స్టోయినిస్‌ బౌలింగ్‌లో ఆవేశ్‌ ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ వికెట్‌ నష్టానికి 93 పరుగులు చేసింది. బట్లర్‌ 38, శాంసన్‌ రెండు పరుగులతో ఆడుతున్నారు.

రాజస్తాన్‌ ఆడుతూ పాడుతూ.. 10 ఓవర్లలో 73/0
లక్నోతో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆడుతూ పాడుతూ లక్ష్యం దిశగా సాగుతుంది. 10 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. బట్లర్‌ 36, జైశ్వాల్‌ 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.

టార్గెట్‌ 155.. ఆరు ఓవర్లలో రాజస్తాన్‌ 47/0
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించింది. ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. జైశ్వాల్‌ 27, బట్లర్‌ 15 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

రాజస్తాన్‌ రాయల్స్‌ టార్గెట్‌ 155
రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ 51 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్‌రాహుల్‌ 39, పూరన్‌ 29 పరుగులు చేశాడు. రాజస్తాన్‌ బౌలర్లలో అశ్విన్‌ రెండు వికెట్లు తీయగా.. బౌల్ట్‌, సందీప్‌ శర్మ, హోల్డర్‌ తలా ఒక వికెట్‌ తీశారు.

18 ఓవర్లలో లక్నో స్కోరు 129/4
18 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ నాలుగు వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. పూరన్‌ 10, స్టోయినిస్‌ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.

మూడో వికెట్‌ కోల్పోయిన లక్నో..
దీపక్‌ హుడా(2) పరుగులు మాత్రమే చేసి అశ్విన్‌ బౌలింగ్‌లో హెట్‌మైర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో మూడు వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ 50 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

కేఎల్‌ రాహుల్‌(39) ఔట్‌.. తొలి వికెట్‌ డౌన్‌
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 39 పరుగులు చేసిన కేఎల్‌ రాహుల్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో బారీ షాట్‌కు యత్నించి బట్లర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం లక్నో వికెట్‌ నష్టానికి 83 పరుగులు చేసింది.

9 ఓవర్లలో లక్నో స్కోరు 74/0
9 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ వికెట్‌ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ 35, కేఎల్‌ రాహుల్‌ 36 పరుగులుతో ఆడుతున్నారు.

5 ఓవర్లలో లక్నో స్కోరు 31/0
5 ఓవర్లు ముగిసేసరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ వికెట్‌ నష్టపోకుండా 30 పరుగులు చేసింది. కైల్‌ మేయర్స్‌ 15, కేఎల్‌ రాహుల్‌ 14 పరుగులతో ఆడుతున్నారు.

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న రాజస్తాన్‌
ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఇవాళ(బుధవారం) 26వ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌జెయింట్స్‌ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ రాయల్స్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఈ సీజన్‌లో వరుస విజయాలతో దుమ్మురేపుతున్న రాజస్తాన్‌ రాయల్స్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ టాప్‌-2లో కొనసాగుతున్నాయి. మరి ఇరుజట్లలో విజయం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్(కెప్టన్‌/వికెట్‌ కీపర్‌), రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, జాసన్ హోల్డర్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చాహల్

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌), కైల్ మేయర్స్, దీపక్ హుడా, మార్కస్ స్టోయినిస్, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్(w), ఆయుష్ బదోని, నవీన్-ఉల్-హక్, అవేష్ ఖాన్, యుధ్వీర్ సింగ్ చరక్, రవి బిష్ణోయ్

అన్ని విభాగాల్లో కాస్త అటుఇటుగా ఉన్న ఈ రెండు జట్లలో గెలుపెవరిదన్నదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఆటగాళ్ల ఫామ్‌ దృష్ట్యా లక్నోతో పోలిస్తే రాజస్థాన్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. సొంత మైదానంలో ఆడటం ఆ జట్టుకు అదనపు అడ్వాంటేజ్‌ అవుతుంది. లీగ్‌లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్‌ల్లో రాజస్థానే విజయం సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement