Sunrisers Hyderabad: పేరుకే మనది.. తెలుగువారి జాడ ఏది..?

IPL 2023: Only One Telugu Player In Sunrisers Hyderabad - Sakshi

IPL 2023: ప్రపంచవ్యాప్తంగా లీగ్‌ల హవా నడుస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ ప్రాంతానికి చెందిన పేరును జట్టుకు పెట్టుకున్నప్పుడు ఒకరిద్దరు స్థానిక ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడం అనవాయితీగా వస్తుంది. ఉదాహరణకు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ ఫ్రాంచైజీని తీసుకుంటే, ఆ జట్టు కెప్టెన్‌తో సహా నలుగురు మహారాష్ట్రీలకు జట్టులో (ఐపీఎల్‌-2023) చోటు దక్కింది. దాదాపు ఇదే సంప్రదాయాన్ని ఆ లీగ్‌ ఈ లీగ్‌ అని తేడా లేకుండా అన్ని లీగ్‌ల్లో పాటిస్తుంటారు.

అయితే ఐపీఎల్‌ ప్రాంచైజీ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మాత్రం ఈ అనవాయితీని తుంగలో తొక్కి, స్థానిక ఆటగాళ్లను చిన్నచూపు చూసింది. పేరుకే అది హైదరాబాద్‌ జట్టు కానీ, అందులో ఒక్క హైదరాబాదీ లేడు. కేవలం ఒక్కడే తెలుగువాడు ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్‌కు చెందిన 19 ఏళ్ల కాకి నితీశ్‌ కుమార్‌ రెడ్డిని ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం కనీస ధర 20 లక్షలకు దక్కించుకుంది.

వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ అయిన నితీశ్‌ను కూడా 2023 వేలం చివర్లో కంటితుడుపు చర్యగా ఎస్‌ఆర్‌హెచ్‌ యాజమాన్యం సొంతం చేసుకుంది. పేరుకు హైదరాబాద్‌ ఫ్రాంచైజీ ఒక్కరు కూడా తెలుగువారు లేకపోతే బాగుండదని ఈ ఎంపిక జరిగి ఉండవచ్చని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన శ్రీకర్‌ భరత్‌, తిలక్‌ వర్మ తదితర ఆటగాళ్లను సొంతం చేసుకునేందుకు సహచర ఫ్రాంచైజీలు ఎగబడుతుంటే, ఎస్‌ఆర్‌హెచ్‌ యజమాని కావ్య మారన్‌ మాత్రం పక్క రాష్ట్రాల ఆటగాళ్లవైపు చూసింది.

ఆటగాళ్ల ఎంపిక విషయంలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగినా, తమ పేరుతో ఉన్న ఫ్రాంచైజీ మాత్రం ఈసారి ఎలాగైనా టైటిల్‌ సాధించాలని ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు కోరుకోవడం కొసమెరుపు.    

ఇదిలా ఉంటే, ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌ మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ గుజరాత్‌ జెయింట్స్‌-ఫోర్‌ టైమ్‌ ఛాంపియన్స్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌తో సీజన్‌ ప్రారంభంకానుంది. సన్‌రైజర్స్‌ తమ సీజన్‌ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 2న రాజస్థాన్‌ రాయల్స్‌తో ఆడుతుంది. 

అబ్దుల్‌ సమద్‌ (జమ్మూ అండ్‌ కశ్మీర్‌)
అన్మోల్‌ ప్రీత్‌ సింగ్‌ (పంజాబ్‌)
ఎయిడెన్‌ మార్క్రమ్‌ (సౌతాఫ్రికా)
రాహుల్‌ త్రిపాఠి (జార్ఖండ్‌)
మయాంక్‌ అగర్వాల్‌ (కర్ణాటక)
హ్యారీ బ్రూక్‌ (ఇంగ్లండ్‌)
నితీశ్‌ రెడ్డి (వైజాగ్‌)
సమర్థ్‌ వ్యాస్‌ (సౌరాష్ట్ర)
సన్వీర్‌ సింగ్‌ (పంజాబ్‌)
వాషింగ్టన్‌ సుందర్‌ (తమిళనాడు)
మార్కో జన్సెన్‌ (సౌతాఫ్రికా)
అభిషేక్‌ శర్మ (పంజాబ్‌)
వివ్రాంత్‌ శర్మ (జమ్మూ)
హెన్రిచ్‌ క్లాసెన్‌ (సౌతాఫ్రికా)
గ్లెన్‌ ఫిలిప్స్‌ (న్యూజిలాండ్‌)
ఉపేంద్ర యాదవ్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)
అకీల్‌ హొసేన్‌ (వెస్టిండీస్‌)
మయాంక్‌ డాగర్‌ (ఢిల్లీ)
ఫజల్‌హక్‌ ఫారూఖీ (ఆఫ్ఘనిస్తాన్‌)
కార్తీక్‌ త్యాగీ (ఉత్తర్‌ప్రదేశ్‌)
భువనేశ్వర్‌ కుమార్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)
మయాంక్‌ మార్కండే (పంజాబ్‌)
టి నటరాజన్‌ (తమిళనాడు)
ఆదిల్‌ రషీద్‌ (ఇంగ్లండ్‌)
ఉమ్రాన్‌ మాలిక్‌ (జమ్మూ అండ్‌ కశ్మీర్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top