IPl 2022: 'ధోని అలా చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది'

IPL 2022: Sunil Gavaskar Explains What MS Dhoni Couldnt-Do Chase Vs PBKS - Sakshi

ఐపీఎల్‌ 2022లో సీఎస్‌కే ఇంకా బోణీ చేయలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లో హ్యాట్రిక్‌ పరాజయాలు చూసిన సీఎస్‌కే అనవసర ఒత్తిడిలో పడుతోంది. ఆదివారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 181 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 54 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. హ్యట్రిక్‌ ఓటములతో డీలా పడిన సీఎస్‌కే తర్వాతి మ్యాచ్‌లోనైనా గెలిచి సీజన్‌లో బోణీ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

కాగా మ్యాచ్‌ ఓడిపోవడం వెనుక ధోని నెమ్మదైన ఆట కూడా ఒక కారణమని టీమిండియా మాజీ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. '' 36 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయి సీఎస్‌కే ఓటమి దాదాపుగా ఖరారైంది. ఈ దశలో శివమ్‌ దూబే, ఎంఎస్‌ ధోనిలు తమ ఇన్నింగ్స్‌తో సీఎస్‌కేను నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఇద్దరి మధ్య అర్థసెంచరీ భాగస్వామ్యం నమోదు కావడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. శివమ్‌ దూబే కాస్త దూకుడుగా బ్యాటింగ్‌ చేయడం.. ధోని అతనికి సహకరించడం మొదట కరెక్టే అనిపించింది.

కానీ ధోని ఆసాంతం నెమ్మదైన ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇదే ధోని చేసిన తప్పు. కెప్టెన్‌ నుంచి పక్కకు తప్పుకున్నాకా యథేచ్చగా బ్యాట్‌ ఝులిపించిన ధోని ఎందుకో పంజాబ్‌తో మ్యాచ్‌లో రిపీట్‌ చేయలేకపోయాడు. వికెట్లు పడుతున్నాయనే కారణం అనుకుందాం అన్నప్పటికి.. దూబేతో మంచి భాగస్వామ్యం నెలకొల్పిన ధోని ఆ తర్వాతైనా భారీ షాట్లు ఆడి ఉంటే బాగుండేది.  ఓవర్‌కు 20 పరుగులు చేయాల్సిన దశలో ఒక ఆటగాడు తనలోని బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌ను బయటికి తీయాలి. కానీ ధోని అలా చేయలేకపోయాడు'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సీఎస్‌కే తన తర్వాతి మ్యాచ్‌ ఏప్రిల్‌ 9న ఎస్‌ఆర్‌హెచ్‌తో ఆడనుంది.

చదవండి: IPL 2022: ఎవరీ వైభవ్ అరోరా.. తొలి మ్యాచ్‌లోనే చుక్కలు చూపించాడు!

 100 మీటర్లు దాటితే 8 పరుగులు.. మూడు డాట్ బాల్స్ ఆడితే ఔట్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top