IPL 2022: స్టార్ల ఎంట్రీ.. అమీతుమీ తేల్చుకోనున్న లక్నో, ఢిల్లీ

IPL 2022: David Warner And Anrich Nortje For Delhi Capitals, Marcus Stoinis To Debut For Lucknow Super Giants - Sakshi

ఐపీఎల్ 2022 సీజన్‌లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్దమైంది. రిషబ్‌ పంత్‌ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌, కేఎల్‌ రాహుల్‌ సారధ్యంలోని లక్నో సూపర్‌ జెయింట్స్‌ ముంబైలోని డీవై పాటిల్‌ స్టేడియం వేదికగా ఇవాళ (ఏప్రిల్‌ 7) అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్ల మధ్య ఈ ఆసక్తికర సమరం రాత్రి 7.30 గంటలకు ప్రారంభంకానుంది. డీసీ తరఫున డేవిడ్‌ వార్నర్‌, అన్రిచ్‌ నోర్జే, ఎల్‌ఎస్‌జీ నుంచి మార్కస్‌ స్టోయినిస్‌ ఎంట్రీ ఇవ్వనుండడంతో ఈ మ్యాచ్‌ మరింత రంజుగా మారనుంది. ప్రస్తుత సీజన్‌లో లక్నో ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి జోరుమీదుండగా.. డీసీ ఈ సీజన్‌లో ఆడిన 2 మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించినప్పటికీ గెలుపుపై ధీమాగా ఉంది. 

వార్నర్‌, నోర్జే లాంటి స్టార్ల రాకతో పంత్‌ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తుండగా..ఆల్‌ రౌండర్‌ స్టోయినిస్‌ ఎంట్రీతో లక్నో సైతం ఏమాత్రం తగ్గేదేలేదంటుంది. లీగ్‌లో ఇరు జట్లు ఆడిన చివరి మ్యాచ్‌ల విషయానికొస్తే.. గత మ్యాచ్‌లో లక్నో సన్‌రైజర్స్‌పై అద్భుత విజయాన్నందుకోగా.. ఢిల్లీ గుజరాత్ చేతిలో ఓటమిపాలైంది. ఇక ఇరు జట్లలో మార్పులు చేర్పుల అంశాన్ని పరిశీలిస్తే.. ఈ మ్యాచ్‌ కోసం డీసీ జట్టులో మూడు మార్పులు జరిగే అవకాశం ఉంది. 

వార్నర్‌ రాకతో గత రెండు మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన టీమ్ సీఫెర్ట్‌పై వేటు పడనుండగా, ఖలీల్ అహ్మద్‌ స్థానంలో నోర్జే, గత రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన మన్‌దీప్ సింగ్ స్థానంలో తెలుగు క్రికెటర్ కేఎస్ భరత్‌లకు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు లక్నో కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. స్టోయినిస్ ఎంట్రీతో ఆండ్రూ టై బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఈ మార్పు మినహా ఎస్‌ఆర్‌హెచ్‌తో బరిలోకి దిగిన జట్టునే ఎల్‌ఎస్‌జీ యధాతథంగా కొనసాగించనుంది. బలాబలాల విషయానికొస్తే.. స్టార్ల రాకతో ఇరు జట్లు సమతూకంగా కనిపిస్తున్నాయి.

తుది జట్లు (అంచనా): 
లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), క్వింటన్ డికాక్(కీపర్), ఎవిన్ లూయిస్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, అంకిత్ రాజ్‌పుత్, రవి బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్

ఢిల్లీ క్యాపిటల్స్: డేవిడ్ వార్నర్, పృథ్వీ షా, కేఎస్ భరత్, రిషబ్‌ పంత్, లలిత్ యాదవ్, రోవమన్ పావెల్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ముస్తాఫిజుర్ రెహ్మాన్
చదవండి: ఢిల్లీ జట్టుకు గుడ్‌న్యూస్‌.. యార్కర్ల కింగ్‌ రానున్నాడు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

09-05-2022
May 09, 2022, 15:43 IST
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఇవాళ (మే 9) మరో ఆసక్తికర సమరం జరుగనుంది. ఇదివరకే ప్లే ఆఫ్స్‌ బరి నుంచి...
09-05-2022
May 09, 2022, 13:26 IST
కోహ్లిని ఓదార్చిన సంజయ్‌ బంగర్‌.. వీడియో వైరల్‌
09-05-2022
May 09, 2022, 13:04 IST
డెవన్‌ కాన్వే.. సీజన్‌ ఆరంభంలో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు. ఆ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేదు. ఏప్రిల్‌ మొదటి వారంలో...
09-05-2022
May 09, 2022, 12:26 IST
పర్యావరణ పరిరక్షణ, పచ్చదనంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ప్రతి యేటా ‘గో గ్రీన్’ నినాదంతో...
09-05-2022
May 09, 2022, 11:20 IST
టీమిండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి ఎస్‌ఆర్‌హెచ్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌కు తనదైన శైలిలో హెచ్చరికలు పంపాడు. సీజన్‌...
09-05-2022
May 09, 2022, 10:59 IST
MS Dhoni: మేము ప్లే ఆఫ్స్‌కు వెళ్తే బాగుంటుంది.. ఒకవేళ అలా జరుగకపోతే: ధోని
09-05-2022
May 09, 2022, 10:29 IST
సీఎస్‌కే కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫినిషర్‌గా మరోసారి రాణించాడు. ఇన్నింగ్స్‌ ఆఖర్లో బ్యాటింగ్‌కు...
09-05-2022
May 09, 2022, 09:18 IST
ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని అరుదైన ఫీట్‌ సాధించాడు. మ్యాచ్‌లో సీఎస్‌కే 200...
09-05-2022
May 09, 2022, 08:52 IST
ఐపీఎల్‌ 2022లో ఇప్పటికే ప్లేఆఫ్‌ అవకాశాలు కోల్పోయినప్పటికీ సీఎస్‌కే అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన...
09-05-2022
May 09, 2022, 07:31 IST
ముంబై: ఇది వరకే ప్లేఆఫ్స్‌కు దూరమైన చెన్నై సూపర్‌కింగ్స్‌... రేసులో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను దెబ్బకొట్టింది. ఆదివారం జరిగిన ఐపీఎల్‌...
09-05-2022
May 09, 2022, 05:49 IST
ముంబై: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్లే ఆఫ్స్‌ ఆశలు సంక్లిష్టమయ్యాయి. మిగిలున్న మ్యాచ్‌లు గెలవాల్సిన దశలో సన్‌రైజర్స్‌ చేతులెత్తేసింది. బ్యాటింగ్‌ లో...
08-05-2022
May 08, 2022, 22:52 IST
ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భాగంగా ఇవాళ (మే 8) ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఓపెన‌ర్ డెవాన్ కాన్వే...
08-05-2022
May 08, 2022, 20:46 IST
ఐపీఎల్ 2022 సీజ‌న్‌లో భాగంగా ఇవాళ (మే 8) సన్‌రైజర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 67 పరుగుల...
08-05-2022
08-05-2022
May 08, 2022, 18:49 IST
IPL 2022 SRH Vs RCB: ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌...
08-05-2022
May 08, 2022, 18:40 IST
ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టును క‌రోనా క‌ల‌క‌లం వెంటాడుతుండ‌గానే మ‌రో షాకింగ్ వార్త వెలుగులోకి వ‌చ్చింది. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఇవాళ...
08-05-2022
May 08, 2022, 17:48 IST
ఢిల్లీ క్యాపిట‌ల్స్ స్టార్ ప్లేయ‌ర్ డేవిడ్ వార్న‌ర్‌పై టీమిండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. అంద‌రూ...
08-05-2022
May 08, 2022, 17:21 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ జగదీశ సుచిత్‌ సరికొత్త రికార్డు సృష్టించాడు.  ఆర్సీబీ...
08-05-2022
May 08, 2022, 16:55 IST
మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓ ప్ర‌త్యేక వీడియోను సోష‌ల్‌మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో ఎస్ఆర్‌హెచ్ ఆట‌గాళ్లు...
08-05-2022
May 08, 2022, 16:28 IST
IPL 2022 SRH Vs RCB- Virat Kohli Golden Duck: ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ... 

Read also in:
Back to Top