మీ విదేశీ ఆటగాళ్లను ఇవ్వండి: ఆర్‌ఆర్‌ రిక్వెస్ట్‌

IPL 2021:RR Approach Franchises Seeking Players On Loan - Sakshi

న్యూఢిల్లీ:  ఐపీఎల్‌ ఆడటానికి భారత్‌కు వచ్చిన విదేశీ ఆటగాళ్లు ఒక్కొక్కరూ బయోబబుల్‌ ఉండలేక స్వదేశం బాట పడుతున్నారు. ఒకవైపు బారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో ఉండటంతో పాటు బయోబబుల్‌ అనేది కొంతమందికి కష్టంగా ఉంది. దాంతో ఇప్పటికే చాలామంది తమ దేశాలకు వెళ్లిపోగా, మరికొంతమంది వెళ్లిపోవడానికి సిద్దమైపోయారు.

వీరిలో లివింగ్‌ స్టోన్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, ఆడం జంపా,  ఆండ్రూ టైలు ఉన్నారు. ఇందులో రిచర్డ్‌సన్‌, ఆడం జంపాలు ఆర్సీబీ ఆడుతుండగా, ఆండ్రూ టై, లివింగ్‌ స్టోన్‌లు రాజస్థాన్‌ రాయల్స్‌కు చెందిన ఆటగాళ్లు. దాంతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఇబ్బందుల్లో పడింది. ఇప్పటికే జోఫ్రా ఆర్చర్‌ గాయం కారణంగా ముందుగానే టోర్నీకి దూరం కాగా, బెన్‌స్టోక్స్‌ మధ్యలో స్వదేశానికి వెళ్లిపోయాడు.. ఐపీఎల్‌లో గాయపడటంతో స్టోక్స్‌కు సర్జరీ అనివార్యమైన పరిస్థితుల్లో ఇంగ్లండ్‌కు వెళ్లిపోయాడు.  ఫలితంగా రాజస్థాన్‌ నలుగురు విదేశీ ఆటగాళ్లను కోల్పోయింది.  రాజస్థాన్‌.

ఆర్‌ఆర్‌ రిక్వెస్ట్‌..
నలుగురు విదేశీ ఆటగాళ్లు దూరం కావడంతో ఆర్‌ఆర్‌ దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది., ఐపీఎల్‌ నిబంధనలను అనుసరించి దానికి అనుగుణంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలను కలిసి వారి వద్దనున్న విదేశీ ఆటగాళ్లను ఇవ్వాలనే కోరుతోంది. ప్రస్తుతం రాజస్థాన్‌ జట్టులో జోస్‌ బట్లర్‌, క్రిస్‌ మోరిస్‌, ముస్తాఫిజుర్‌, డేవిడ్‌ మిల్లర్‌లు మాత్రమే ఉన్నారు.

దాంతో జట్టును తాము కోల్పోయిన వారి స్థానాల్లో విదేశీ ఆటగాళ్లతో పూడ్చుకోవాలని భావిస్తోంది. తమకు ఏ ఫ్రాంచైజీ అయినా విదేశీ ఆటగాళ్లను ఇవ్వాలనే కోరుతోంది. ఈ మేరకు రాజస్థాన్‌ ఫ్రాంచైజీ తమను సంప్రదించినట్లు వేరే ఫ్రాంచైజీ సీఈవోలు తెలిపారు. ‘రాజస్థాన్‌ మమ్ముల్ని విదేశీ ఆటగాళ్లు కావాలని కోరింది. దీనిపై ఇంకా ఏమీ నిర్ణయం తీసుకోలేదు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌దే తుది నిర్ణయం​’ అని తెలిపారు. 

రూల్స్‌ ఏం చెబుతున్నాయి..
ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం  ఏజట్టులోనైనా 60 శాతం కంటే తక్కువ మంది విదేశీ ఆటగాళ్లు లేకపోతే(అర్థాంతరంగా తప్పుకుంటే) లోన్‌ విండో ఆప్షన్‌ను ఉపయోగించుకోవచ్చు. అంటే రుణ ప్రాతికదికన వేరే ఫ్రాంచైజీల్లో అధికంగా ఉన్న విదేశీ ఆటగాళ్లను తీసుకోవచ్చు. దీనికి ఆ సదరు ఫ్రాంచైజీలు ఒప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత సీజన్‌లో రెండు మ్యాచ్‌ల కంటే ఎవరైతే తక్కువగా ఒక ఫ్రాంచైజీ తరఫున ఆడి ఉంటారో వారిని లోన్‌ విండో రూపంలో తీసుకోవచ్చు. అలా తీసుకున్న ఆటగాడు  ఆ సీజన్‌ అంతా అదే ఫ్రాంచైజీకి ఆడాల్సి ఉంటుంంది. అలాగే హోమ్‌ ఫ్రాంచైజీతో మ్యాచ్‌లో ఆడటానికి అనర్హుడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top