భారీ హిట్టర్లు ఉంటే ఇలానే ఉంటుంది: ధోని | IPL 2021: We Were Very Off Target Against Good Batters Who Hit Hard, Dhoni | Sakshi
Sakshi News home page

భారీ హిట్టర్లు ఉంటే ఇలానే ఉంటుంది: ధోని

May 2 2021 7:24 AM | Updated on May 2 2021 7:35 AM

IPL 2021: We Were Very Off Target Against Good Batters Who Hit Hard, Dhoni - Sakshi

Photo Courtesy: IPL

బౌలర్లకు ధోని వార్నింగ్‌

ఢిల్లీ: తాము చేసిన కొన్ని తప్పిదాల కారణంగానే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను కాపాడుకోలేకపోయామని సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్‌ ధోని అసంతృప్తి వ్యక్తం చేశాడు. భారీ స్కోరు చేసినా ఒత్తిడిని అధిగమించలేని కారణంగా మ్యాచ్‌ చేజారిపోయిందన్నాడు. మ్యాచ్‌ తర్వాత ధోని మాట్లాడుతూ.. ‘ ఇది ఒక మంచి వికెట్‌. ఈ తరహా బ్యాటింగ్‌ వికెట్‌ కచ్చితంగా బౌలర్లకు సవాలే. కీలక సమయంలో క్యాచ్‌లు జారవిడిచాం. మా బౌలర్లు మెరుగ్గానే బౌలింగ్‌ చేశారు. కానీ ఈ మ్యాచ్‌ ద్వారా కొన్ని పాఠాలు నేర్చుకోవాలి.

ఈ వికెట్‌ హిట్‌ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. ఈ టోర్నమెంట్‌లో కొన్ని మ్యాచ్‌లను దగ్గరగా వచ్చి ఓడిపోయాం. అలాగే కొన్ని క్లోజ్‌ గేమ్స్‌లో గెలిచాం. పాయింట్ల టేబుల్‌లో ఎక్కడ ఉన్నామనే విషయంతో సంబంధం లేకుండా ఆ టైమ్‌లో గేమ్‌పైనే దృష్టి పెట్టాలి.  అప్పుడే పాయింట్ల టేబుల్‌లో నీ స్థానం మెరుగ్గా ఉంటుంది. భారీ హిట్టర్లు ఉన్నప్పుడు తప్పిదాలు చేస్తే ఇలానే ఉంటుంది. పెద్ద టార్గెట్‌లు కూడా చిన్నవిగానే ఉంటాయి. ఆ సమయంలోనే ప్రణాళికల్ని కచ్చితంగా అమలు చేయాలి.  20 ఓవర్‌లో కనీసం ఒక సిక్స్‌ కూడా రాకపోయినట్లయితే మ్యాచ్‌ను గెలిచేశాళ్లం. ఇది బాధిస్తోంది.. కానీ గేమ్‌ స్పిరిట్‌తో ముందుకు వెళ్లాలి’ అని పేర్కొన్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement