రంజీ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్‌ విధ్వంసం | Ranji Trophy 2026, Urvil Patel Smashes 85 Off 67 Balls As Gujarat Take 115 Run Lead Against Odisha, Check Details | Sakshi
Sakshi News home page

రంజీ మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్‌ విధ్వంసం

Oct 13 2026 2:57 PM | Updated on Oct 13 2026 3:13 PM

Ranji trophy 2026: Urvil smashed 85 runs from just 67 balls

source: X

రంజీ ట్రోఫీ 2026-27 మ్యాచ్‌లో సీఎస్‌కే బ్యాటర్‌, గుజరాత్‌ వికెట్‌ కీపర్‌ ఉర్విల్‌ పటేల్‌ చెలరేగిపోయాడు. ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 67 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 85 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు.

ఉర్విల్‌తో పాటు వేదాంత్‌ త్రివేది (108), ఆర్య దేశాయ్‌ (94), హర్షల్‌ పటేల్‌ (60) సత్తా చాటడంతో గుజరాత్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 439 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఒడిషా బౌలర్లలో బదాయ్‌ బిస్వాల్‌ 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. బ్యాటర్లు చెలరేగడంతో గుజరాత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 115 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.

అంతకుముందు ఒడిషా తొలి ఇన్నింగ్స్‌లో 324 పరుగులు చేసింది. గౌరవ్‌ చౌదరి (137) సెంచరీతో కదంతొక్కాడు. సందీప్‌ పట్నాయక్‌ (69) అర్ద సెంచరీతో రాణించాడు. గుజరాత్‌ బౌలర్లలో నగ్వస్వల్లా 3, గజా, సిద్దార్థ్‌ దేశాయ్‌, హర్షల్‌ పటేల్‌ తలో 2 వికెట్లు తీశారు.

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఒడిషా మూడో రోజు మూడో సెషన్‌ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 109 పరుగులు వెనుకపడి ఉంది.

ఐపీఎల్‌లోనూ మెరుపులు
ఉర్విల్ పటేల్ విషయానికొస్తే.. ఇతను ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడి ఆకట్టుకున్నాడు. ఓ మ్యాచ్‌లో కేవలం 13 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించి వార్తల్లో నిలిచాడు. ఇప్పుడు అదే దూకుడును రంజీ ట్రోఫీలోనూ ప్రదర్శిస్తున్నాడు.

ఇదీ చదవండి: చెన్నై పోలీసులకు సీఎస్‌కే భారీ కానుక


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement