పొలార్డ్‌ కోసం అన్ని అస్త్రాలు ప్రయోగించాం.. 

IPL 2021: We Could Not Shut Pollard Down, Stephen Fleming - Sakshi

ఢిల్లీ:  ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ కీరోన్‌ పొలార్డ్‌ ఐపీఎల్‌లో చాలా కాలం తర్వాత ఒక గొప్ప ఇన్నింగ్స్‌ ఆడాడని సీఎస్‌కే కోచ్‌ స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ కొనియాడాడు. బంతిని హిట్‌ చేసేటప్పుడు పొలార్డ్‌ కచ్చితమైన టైమింగ్‌తో ఉంటాడన్నాడు. పొలార్డ్‌ క్రీజ్‌లో పాతుకుపోతే ప‍్రమాదమనే విషయం తమకు తెలుసని, అతన్ని ఔట్‌ చేయడానికి అన్ని అస్త్రాలు ప్రయోగించామన్నాడు. కానీ చివరకు అతన్ని పెవిలియన్‌కు చేర్చడంలో విఫలం కావడంతోనే తమను పరాజయం వెక్కిరించిందన్నాడు.  మ్యాచ్‌ తర్వాత రిపోర్టర్లతో  మాట్లాడిన ఫ్లెమింగ్‌.. ‘  అసలు పొలార్డ్‌ ఏ షాట్‌ ఎలా ఆడతాడో కచ్చితంగా అంచనా వేయలేం. 

ఐపీఎల్‌లో సుదీర్ఘ కాలం తర్వాత మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు. పొలార్డ్‌  చాలా ప్రమాదకరమైన ఆటగాడు. ముంబైకు ప్రధాన ఆటగాడు. అతన్ని ఔట్‌ చేయడానికి చాలా ప‍్రయోగాలు చేశాం. కానీ నిలువరించలేకపోయాం. ముంబై ఇండియన్స్‌ మూడు వికెట్లు తీసిన తర్వాత వారిపై ఒత్తిడి తెచ్చే యత్నం చేశాం. మేము చాలా మంచి టార్గెట్‌ ముంబై ముందు ఉంచాం. అయినా కొన్ని తప్పిదాలతో ఓటమి పాలయ్యాం. మేము చేసిన తప్పిదాలను విశ్లేషించుకుని తర్వాత మ్యాచ్‌కు సిద్ధమవుతాం.  మేము మరింత కసిగా తుదపరి మ్యాచ్‌కు వస్తాం. టోర్నమెంట్‌లో ఓడిపోతే ప్రత్యర్థి జట్టు బాగా ఆడిందనే అంటారు. అది సర్వసాధారణం’ అని తెలిపాడు. 

కాగా, సీఎస్‌కే నిర్దేశించిన 219 పరుగుల భారీ టార్గెట్‌లో పొలార్డ్‌ 34 బంతుల్లో 8 సిక్స్‌లు, 6 ఫోర్లతో సునామీ ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలుత 17 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించిన పొలార్డ్‌.. మ్యాచ్‌ను గెలిపించేతవరకూ క్రీజ్‌లో ఉండి తన బ్యాటింగ్‌ పవర్‌ చూపెట్టాడు. ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు పిండుకుని ముంబైకు ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. 

ఇక్కడ చదవండి: డేవిడ్‌ వార్నర్‌కు నో ప్లేస్‌
మీకు బౌలర్లు ఉన్నారు.. కానీ డెత్‌ ఓవర్‌ బౌలర్‌ ఎక్కడ?
వార్నర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌ వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top