చెన్నైలో అదొక ట్రెండ్‌: రోహిత్‌ | Sakshi
Sakshi News home page

చెన్నైలో అదొక ట్రెండ్‌: రోహిత్‌

Published Wed, Apr 14 2021 7:40 AM

IPL 2021: The Trend in Chennai Is you Cant Hit From Ball One, Rohit - Sakshi

చెన్నై: కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి వరకూ పోరాడి గెలవడంపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంతోషం వ్యక్తం చేశాడు. ఓడిపోవడం ఖాయమనుకున్న తరుణంలో తిరిగి రేసులోకి రావడం అసాధారణ పోరాటంగా రోహిత్‌ అభివర్ణించాడు. ఈ తరహా గేమ్‌లను చాలా అరుదుగా చూస్తామని పేర్కొన్న రోహిత్‌.. ఈ మ్యాచ్‌లో సాధించిన విజయంతో రెట్టించిన ఉత్సాహం జట్టు సభ్యుల్లో వచ్చిందన్నాడు. దీన్నే రానున్న మ్యాచ్‌ల్లో కూడా కొనసాగిస్తామని రోహిత్‌ తెలిపాడు

మ్యాచ్‌ తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన రోహిత్‌.. ఇది కంప్లీట్‌ టీమ్‌ ఎఫర్ట్‌ అని అన్నాడు. ప్రత్యేకంగా ఈ ఘనత బౌలర్లదేనని, ఇక బ్యాటర్స్‌గా తాము మంచి ప్రదర్శన చేయాల్సి ఉందన్నాడు. చెన్నైలో తొలి బంతి నుంచి హిట్‌ చేసే పరిస్థితులు ఉండటం లేదని, ఇది చెన్నైలోని చెపాక్‌లో ఒక ట్రెండ్‌లా కొనసాగుతోందన్నాడు. ఇక్కడ బ్యాటింగ్‌కు క్రీజ్‌లోకి వచ్చే ముందే ఎలా ఆడాలనేది ప్లాన్‌ చేసుకుని రావాలన్నాడు. అలా కాకుండా మొదటి బంతి నుంచి హిట్టింగ్‌కు దిగితే మాత్రం సక్సెస్‌ కావడం అంత ఈజీ కాదన్నాడు. తామింకా 15-20 పరుగులు చేయాల్సిందని, ఆఖరి ఓవర్లలో అనుకున్న పరుగులు రాలేదన్నాడు. డెత్‌ ఓవర్లలో బ్యాటింగ్‌ ఎలా చేయాలనే దానిపై కూడా ఫోకస్‌ చేస్తామన్నాడు.

ఇక ఇయాన్‌ మోర్గాన్‌ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్‌లో ఓటమి నిరుత్సాహ పరిచింది. ఈ గేమ్‌ మొత్తం మీద చూస్తూ మాదే పైచేయిగా కనిపించింది. మేము ఈజీగా స్కోరును ఛేజ్‌ చేస్తామనిపించింది. కొన్ని తప్పులు చేయడంతో మూల్యం చెల్లించుకున్నాడు. ముంబై చాలా స్ట్రాంగ్‌ టీమ్‌. వారు పుంజుకున్న తీరు అమోఘం. మేము కచ్చితమైన ఆటను ఆడలేకపోయాం. చివరి 10 ఓవర్లలో మ్యాచ్‌ మా చేతుల్లోంచి జారుపోతూ వచ్చింది. ఈ వికెట్‌పై సెకండ్‌ బ్యాటింగ్‌ చాలా కష్టంగా ఉంది. ఆర్సీబీ-ముంబై ఇండియన్స్‌ గేమ్‌లో కూడా దాదాపు ఇలానే జరిగింది. కానీ ఏబీ ఎదురుదాడికి దిగడంతో ఆర్సీబీ గెలిచింది. మేము మంచి పొజిషన్‌లో ఉండి కూడా దాన్ని కడవరకూ తీసుకురాలేకపోయాం. ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని మోర్గాన్‌ పేర్కొన్నాడు.

ఇక్కడ చదవండి: కోల్‌కతా...చేజేతులా

‘వారివల్లే ఆర్సీబీకి..వేలానికి ముందు రోజు జరిగింది అదే’

Advertisement
Advertisement