టీమ్‌మేట్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసిన జడేజా | IPL 2021: Ravindra Jadeja Hilariously Imitates Graeme Smiths | Sakshi
Sakshi News home page

టీమ్‌మేట్స్‌ను ఎంటర్‌టైన్‌ చేసిన జడేజా

Apr 22 2021 4:01 PM | Updated on Apr 22 2021 7:59 PM

IPL 2021: Ravindra Jadeja Hilariously Imitates Graeme Smiths - Sakshi

Photo Courtesy: Instagram

ముంబై: గత ఐపీఎల్‌ సీజన్‌లో ఘోరంగా చతికిలబడ్డ చెన్నై సూపర్‌ కింగ్స్‌.. ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్‌ను ఓటమితో ఆరంభించిన సీఎస్‌కే.. ఆపై హ్యాట్రిక్‌ విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బుధవారం కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో గెలిచిన సీఎస్‌కే టాప్‌ను ఆక్రమించింది.  ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో సీఎస్‌కేకు పరాజయం ఎదురుకాగా, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, కేకేఆర్‌లపై విజయం సాధించింది ధోని అండ్‌ గ్యాంగ్‌.  కోల్‌కతాపై విజయం తర్వాత సీఎస్‌కే మంచి ఎంటర్‌టైన్‌ మూడ్‌లో కనిపించింది. ప్రధానంగా ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన టీమ్‌మేట్స్‌ను ఎంటర్‌టైన్‌ చేస్తూ వారిలో నవ్వులు పూయించాడు. 

దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ స్టైల్‌ను అనుకరించి తన యాక్టింగ్‌ స్కిల్స్‌ను ప్రదర్శించాడు. లెఫ్ట్‌ హ్యాండర్‌ అయిన గ్రేమ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ చేసే క్రమంలో కాళ్లను బాగా ఎడంగా చాపడమే కాకుండా, చేతుల్ని కూడా కాళ్లకు సమానంగా ఉండేటట్లు చూసుకుని ఆడేవాడు. దీన్ని అనుకరించాడు జడేజా. ఈ అనుకరణను చూసిన సహచర సీఎస్‌కే ఆటగాళ్ల ఒక్కసారిగా నవ్వగా, ఆ వీడియోను జడేజా తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశాడు. 

ఇక్కడ చదవండి: వైరల్‌: భజ్జీ కాళ్లు మొక్కిన రైనా.. వెంటనే
రసెల్‌.. ఇది మమ్మల్ని బాధిస్తోంది..!

Advertisement
 
Advertisement
Advertisement