
స్కాట్ స్టైరిస్ పవర్ ర్యాంకింగ్స్‌లో చివరన రాజస్తాన్ జట్టు.. అదిరిపోయే రిప్లై
IPL 2021 Phase 2- Rajasthan Royals: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 రెండో అంచె కోసం అన్ని జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే యూఏఈ చేరుకున్న ఆటగాళ్లు ప్రాక్టీసులో నిమగ్నమయ్యారు. ఇక ఆదివారం నుంచి ఈ సీజన్ రెండో దశ ఆరంభం కానున్న నేపథ్యంలో టోర్నీ విజేత గురించి మాజీలు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ స్కాట్ స్టైరిస్.. ఐపీఎల్ జట్ల పవర్ ర్యాకింగ్స్ అంటూ ఓ జాబితాను ట్విటర్‌లో షేర్ చేశాడు.
ఎవరు తుదిజట్టులో ఉంటారో, వ్యక్తిగత బలాబలాలు ఏమిటో తెలియకుండానే ఈ లిస్టు ప్రకటిస్తున్నా అంటూ.. అందరూ ఊహించినట్లుగానే ముంబై ఇండియన్స్‌కు జాబితాలో మొదటి స్థానం కట్టబెట్టాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్‌కింగ్స్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్, కేకేఆర్.. ఆఖరున రాజస్తాన్ రాయల్స్ పేరును చేర్చాడు. ఇక స్కాట్ ట్వీట్‌పై స్పందించిన రాజస్తాన్ రాయల్స్ హిలేరియస్ మీమ్‌తో జవాబిచ్చింది.
బాలీవుడ్ మూవీ ‘లవ్ ఆజ్ కల్’ హీరోయిన్ సారా అలీఖాన్ ఫొటోను షేర్ చేస్తూ... ‘‘ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నావా’’ అన్న డైలాగ్‌తో కౌంటర్ ఇచ్చింది. ఈ మీమ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కాగా ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన రాజస్తాన్ నాలుగింటిలో ఓడింది. ఇక రెండో అంచెలో భాగంగా సెప్టెంబరు 21న రాజస్తాన్, పంజాబ్ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది.
చదవండి: Sanju Samson: ఈసారి కచ్చితంగా చాంపియన్‌గా నిలవాలి!
https://t.co/RU9QAewpGX pic.twitter.com/D2y9Jj8Q0p
— Rajasthan Royals (@rajasthanroyals) September 16, 2021