ఐపీఎల్‌ 2021: ఈసారి మాత్రం ఢిల్లీదే పైచేయి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

IPL 2021: Mumbai Indians Vs Delhi Capitals Match Live Updates - Sakshi

ఈసారి మాత్రం ఢిల్లీదే పైచేయి
ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ మరో విజయాన్ని నమోదు చేసింది. చెపాక్‌ వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 138 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఢిల్లీ బ్యాటింగ్‌లో శిఖర్‌ ధావన్‌ 45 పరుగులతో ఆకట్టుకోగా.. స్టీవ్‌ స్మిత్‌ 33 పరుగులతో రాణించాడు. ఆఖర్లో కాస్త ఉత్కంఠ రేపినా లలిత్‌ యాదవ్‌(22 నాటౌట్‌), హెట్‌మైర్‌ (14 నాటౌట్‌)‌ చివరి వరకు నిలబడి మ్యాచ్‌ను గెలిపించాడు. ముంబై బౌలర్లలో పొలార్డ్‌, చహర్‌, జయంత్‌ యాదవ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. అంతకుముందు టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది.

రోహిత్‌ శర్మ 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఇషాన్‌ కిషన్‌ 26 మినహా ఎవరు రాణించలేకపోవడంతో ముంబై తక్కువ స్కోరునే నమోదు చేసింది. కాగా ఢిల్లీ బౌలర్లలో అమిత్‌ మిశ్రా 4 వికెట్లతో చెలరేగగా.. ఆవేశ్‌ ఖాన్‌ 2, రబడ, స్టొయినిస్‌, లలిత్‌ యాదవ్‌ చెరో వికెట్ తీశారు. కాగా గత సీజన్‌లో ముంబైతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఈసారి మాత్రం ముంబైపై పైచేయి సాధించింది.

రిషబ్‌ పంత్‌ అవుట్‌.. నాలుగో వికెట్‌ డౌన్‌
ఢిల్లీ క్యాపిటల్స్‌ రిషబ్‌ పంత్‌ రూపంలో నాలుగో వికెట్‌ కోల్పో‍యింది. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌ ఐదో బంతిని పంత్‌ భా‌రీ షాట్‌ ఆడే యత్నంలో కృనాల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ స్కోరు 18 ఓవర్లలో 123/4గా ఉంది. లలిత్‌ యాదవ్‌ 17, హెట్‌మైర్‌ 7 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ధావన్‌ ఔట్‌.. మూడో వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ
ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ శిఖర్‌ ధావన్‌(45) రూపంలో మూడో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు చేసింది. ఢిల్లీ విజయానికి ఇంకా 38 పరుగులు అవసరమయ్యాయి.

నిలకడగా ఆడుతున్న ఢిల్లీ
ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలకడగా ఆడుతుంది. 138 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు ప్రస్తుతం 13 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. ధావన్‌ 33, లలిత్‌ యాదవ్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు.

9 ఓవర్లలో ఢిల్లీ స్కోరు 64/1
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 9 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టానికి 64 పరుగులు చేసింది. స్మిత్‌ 33, ధావన్‌ 20 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఆచితూచి ఆడుతున్న ఢిల్లీ
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆచితూచి ఆడుతుంది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తుండడంతో ఢిల్లీ బ్యాట్స్‌మన్‌ నెమ్మదిగా ఆటను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీ 7 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 47 పరుగులు చేసింది. ధావన్‌ 15, స్మిత్‌ 21 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన ఢిల్లీ క్యాపిటల్స్‌
138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. జయంత్‌ యాదవ్‌ వేసిన ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ మూడో బంతికి పృథ్వీ షా(7) కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్‌ 2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 16 పరుగులు చేసింది.

ఢిల్లీ లక్ష్యం 138
చెపాక్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ 44 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఇషాన్‌ కిషన్‌ 26 మినహా ఎవరు రాణించలేకపోవడంతో ముంబై తక్కువ స్కోరునే నమోదు చేసింది. కాగా ఢిల్లీ బౌలర్లలో అమిత్‌ మిశ్రా 4 వికెట్లతో చెలరేగగా.. ఆవేశ్‌ ఖాన్‌ 2, రబడ, స్టొయినిస్‌, లలిత్‌ యాదవ్‌ చెరో వికెట్ తీశాడు.

ఇషాన్‌ కిషన్‌ ఔట్‌.. ఏడో వికెట్‌ డౌన్‌
ముంబై ఇండియన్స్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. అమిత్‌ మిశ్రా వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌ మూడో బంతికి ఇషాన్‌ కిషన్‌(26) క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 18 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది.

మిశ్రా మాయాజాలం.. పోలార్డ్‌(2) ఔట్‌‌‌‌
హార్డ్‌ హిట్టర్‌ పోలార్డ్‌ను అమిత్‌ మిశ్రా బోల్తా కొట్టించాడు. 9వ ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టిన ఈ వెటరన్‌ స్పిన్నర్‌ 12వ ఓవర్‌లో ముంబైకు మరో షాక్‌ ఇచ్చాడు. 11.5వ బంతికి పోలార్డ్‌ను ఎల్బీడబ్యూ ఔట్‌ చేసి పెవిలియన్‌కు పంపాడు. 15 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 101/6. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్‌(14), జయంత్‌ యాదవ్‌(9) ఉన్నారు.

పెవిలియన్‌కు క్యూ కడుతున్న ముంబై ఆటగాళ్లు.. కృనాల్‌(1) క్లీన్‌ బౌల్డ్
9వ ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన ముంబై ఇండియన్స్‌ జట్టుకు 11వ ఓవర్‌లో మరో షాక్‌ తగిలింది. కృనాల్‌ పాండ్యాను(5 బంతుల్లో 1) లలిత్‌ యాదవ్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేయడంతో ముంబై ఐదో వికెట్‌ కోల్పోయింది. 11 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 82/5. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్‌(5), పోలార్డ్‌(1) ఉన్నారు.

మరో వికెట్ కోల్పోయిన ముంబై.. హార్ధిక్‌ డకౌట్‌‌‌
పది పరుగుల వ్యవధిలో ముంబై జట్టు మూడు కీలకమైన వికెట్లు కోల్పోయింది. అమిత్‌ మిశ్రా వేసిన 9వ ఓవర్‌ నాలుగో బంతికి రోహిత్‌ పెవిలియన్‌ బాట పట్టగా, ఆఖరి బంతికి హార్ధిక్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు. అచ్చం రోహిత్‌ లానే హార్ధిక్‌ కూడా లాంగ్‌ ఆన్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న స్టీవ్‌ స్మిత్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. 9 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 77/4. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్‌(3), కృనాల్‌ పాండ్యా(0) ఉన్నారు.  

రోహిత్‌ను(44) బోల్తా కొట్టించిన అమిత్‌ మిశ్రా, ముంబై స్కోర్‌ 76/3
దూకుడుగా ఆడుతున్న రోహిత్‌ శర్మ(30 బంతుల్లో 44; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) వెటరన్‌ స్పిన్నర్‌ అమిత్‌ శర్మ మాయాజాలానికి చిక్కాడు. మిశ్రా వేసిన ఫ్లయిటెడ్‌ బంతికి క్రీజ్‌ వదిలి ముందుకు వచ్చిన రోహిత్‌... లాంగ్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న స్టీవ్‌ స్మిత్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ బాటపట్టాడు. 8.4 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 76/3. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్‌(1), హార్ధిక్‌ పాండ్యా(0) ఉన్నారు.  

రెండో వికెట్ కోల్పోయిన ముంబై, సూర్యకుమార్‌(24)‌ ఔట్
ధాటిగా ఆడుతున్న సూర్యకుమార్‌ను(15 బంతుల్లో 24; 4 ఫోర్లు) ఆవేశ్‌ ఖాన్‌ బోల్తా కొట్టించాడు. ఆవేశ్‌‌ ఖాన్‌ వేసిన అద్భుత బంతిని థర్డ్‌ మెన్‌ దిశగా తరలించే క్రమంలో వికెట్‌ కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి సూర్యకుమార్‌ ఔటయ్యాడు. 7 ఓవర్ల తర్వాత ముంబై స్కోర్‌ 67/2. క్రీజ్‌లో రోహిత్‌(23 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్‌ కిషన్‌(0) ఉన్నారు.

రోహిత్‌, సూర్య దూకుడు.. ముంబై 55/1
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ దూకుడు ప్రదర్శిస్తోంది. డికాక్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్‌తో కలిసి రోహిత్‌ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ముంబై 6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 55 పరుగులు చేసింది. రోహిత్‌ 29, సూర్య 23 పరుగులతో క్రీజులో ఉ‍న్నారు.

డికాక్‌ ఔట్‌.. తొలి వికెట్‌ డౌన్‌
ముంబై ఇండియన్స్‌ క్వింటన్‌ డికాక్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోయింది. స్టోయినిస్‌ వేసిన 3వ ఓవర్‌ తొలి బంతికి స్టొయినిస్‌ కీపర్‌ పంత్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై వికెట్‌ నష్టానికి 9 పరుగులు చేసింది.

2 ఓవర్లలో ముంబై స్కోరు.. 10/0
చెపాక్‌ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ తన ఇన్నింగ్స్‌ను నిధానంగా ఆరంభించింది. ప్రస్తుతం 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 9 పరుగులు చేసింది.

చెన్నై: ఐపీఎల్‌‌14లో మరో ఆసక్తికర సమరానికి తెరలేచింది. తొలి మ్యాచ్‌లో ఓడి ఆ తర్వాత రెండు వరుస విజయాలతో జోరు మీదున్న ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది.కాగా టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌‌ బ్యాటింగ్‌‌ ఎంచుకుంది. ఇక ముఖాముఖి పోరు చూసుకుంటే ఢిల్లీపై ముంబయి ఇండియన్స్‌ది కాస్త పైచేయిలా కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ఈ రెండు జట్లు 28 మ్యాచ్‌ల్లో తలపడగా.. అందులో 16 మ్యాచ్‌లు ముంబై గెలవగా.. 12 మ్యాచ్‌ల్లో ఢిల్లీ జట్టు గెలుపొందింది. టోర్నీలో ఢిల్లీపై ముంబయి చేసిన అత్యధిక స్కోరు 218 పరుగులుకాగా.. ముంబయిపై ఢిల్లీ చేసిన అత్యధిక స్కోరు 213 పరుగులు. ఇక గత ఐపీఎల్ 2020 సీజన్‌లో ఈ రెండు జట్లు ఏకంగా నాలుగు సార్లు తలపడ్డాయి. ఇందులో రెండు లీగ్ దశ మ్యాచ్‌లు ఒక ప్లేఆఫ్ సహా ఫైనల్‌ మ్యాచ్‌ ఉంది. విశేషమేమిటంటే.. ఈ నాలుగుసార్లు ఢిల్లీపై ముంబైనే గెలవడం విశేషం.

ఇక బలాబలాలు చూసుకుంటే..  మంచి ఆరంభాలను దక్కించుకుంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ వాటిని భారీస్కోరుగా మార్చాలని చూస్తున్నాడు. మరో ఓపెనర్‌‌ డికాక్‌‌ కూడా ఇదే ఆలోచనతో ఉన్నాడు. సూర్యకుమార్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌, కీరన్‌‌ పొలార్డ్‌‌, హార్దిక్‌‌, క్రునాల్‌‌లతో బలమైన బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌ ఉన్నప్పటికీ.. ఇప్పటిదాకా ముంబై ఆ స్థాయిలో ఆడలేదు. మిడిల్‌‌ ఓవర్లలో  సత్తా చాటలేక నార్మల్‌‌ టార్గెట్‌‌కే పరిమితం అవుతోంది. వరుసగా మూడు మ్యాచ్‌‌ల్లో ఆ టీమ్‌‌ 159, 152, 150 స్కోర్లే చేసింది.  జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ అటాక్‌‌ విజృంభించడంతో గత రెండు మ్యాచ్‌‌ల్లో చిన్న టార్గెట్లను కాపాడుకున్నా.. అన్ని సార్లూ అద్భుతాన్ని ఆశించలేం. బలమైన బ్యాటింగ్‌‌ ఆర్డర్‌‌ ఉన్న ఢిల్లీపై ఇలాంటి స్కోర్లతో ఫలితం ఉండదు కాబట్టి మిడిలార్డర్‌‌ ప్లేయర్లు బ్యాట్‌‌ఝుళిపించాల్సిన అవసరం ఉంది. బౌలింగ్‌‌లో ముంబైకి తిరుగులేదు.

మరోవైపు గత మ్యాచ్‌‌లో పంజాబ్‌‌ కింగ్స్‌‌ ఇచ్చిన భారీ టార్గెట్‌‌ను ఈజీగా ఛేజ్‌‌ చేసిన ఢిల్లీ ఫుల్‌‌ జోష్‌‌లో ఉంది. ఓపెనర్​ ధవన్‌‌ బెస్ట్‌‌ ఫామ్‌‌లో ఉన్నాడు. అతని పాటు పృథ్వీ షా, కెప్టెన్‌‌ పంత్‌‌ కూడా టచ్‌‌లో ఉన్నారు. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో  బరిలోకి దిగిన స్టీవ్‌‌ స్మిత్‌‌ ఫెయిలయ్యాడు. కాబట్టి తిరిగి రహానెను తుది జట్టులోకి తెచ్చే చాన్సుంది. ఆల్‌‌రౌండర్లు స్టోయినిస్‌‌, లలిత్‌‌ యాదవ్‌‌ కూడా సత్తా చాటేందుకు రెడీగా ఉన్నారు. కగిసో రబాడ, క్రిస్‌‌ వోక్స్‌‌, అశ్విన్‌‌తో కూడిన బౌలింగ్‌‌ యూనిట్‌‌బలంగానే ఉంది. లాస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఢిల్లీ.. నలుగురు పేసర్లతో ఆడింది. చెపాక్‌‌ వికెట్‌‌ స్పిన్‌‌కు అనుకూలిస్తున్న నేపథ్యంలో ముంబైపై సీనియర్‌‌ స్పిన్నర్‌‌ మిశ్రాను బరిలోకి దింపొచ్చు.

ముంబై ఇండియన్స్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్‌ డికాక్‌‌, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా,  కీరన్ పొలార్డ్, కృనాల్ పాండ్యా,  రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్‌ప్రీత్ బుమ్రా, జయంత్‌ యాదవ్‌

ఢిల్లీ క్యాపిటల్స్‌: రిషబ్‌ పంత్‌(కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), శిఖర్ ధవన్, పృథ్వీ షా, స్టీవ్‌ స్మిత్‌, మార్కస్ స్టోయినిస్,
షిమ్రోన్‌ హెట్‌మైర్‌, రవిచంద్రన్ అశ్విన్, రబాడ, అమిత్‌ మిశ్రా, అవేష్ ఖాన్, లలిత్‌ యాదవ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

06-05-2021
May 06, 2021, 15:50 IST
జోహన్నెస్‌బర్గ్‌ : ఐపీఎల్‌ లాంటి లీగ్‌ల ద్వారా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఎందరో పరిచయమయ్యారు. రవీంద్ర జడేజా, అజింక్య రహానే లాంటి...
06-05-2021
May 06, 2021, 14:09 IST
ముంబై: బీసీసీఐ పక్కాగా జాగ్రత్తలు తీసుకుని ఆటగాళ్లను బయోబబుల్‌లో ఉంచినప్పటికీ కూడా కరోనా ప్రభావం ఐపీఎల్- 2021 మీద పడింది. దీంతో ఈ లీగ్‌ను అనూహ్యంగా మధ్యలోనే వాయిదా వేయాల్సి...
06-05-2021
May 06, 2021, 11:04 IST
భారత్‌లో కోవిడ్‌ వీర విహారం చేస్తోంది. ఐపీఎల్‌ 2021కు కరోనా సెగ తగలకూడదని బయోబబుల్‌లో ఆటగాళ్లను ఉంచి ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా...
06-05-2021
May 06, 2021, 06:01 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో కొత్త తరహా ఫిక్సింగ్‌కు ప్రయత్నం జరిగినట్లు తేలింది. ఇందు కోసం బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్‌ను...
06-05-2021
May 06, 2021, 04:06 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడటంతో వివిధ ఫ్రాంచైజీలలో భాగంగా ఉన్న విదేశీ క్రికెటర్లు బయో బబుల్‌ను వదిలి తమ...
05-05-2021
May 05, 2021, 19:30 IST
సిడ్నీ: ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ మైకెల్‌ స్లేటర్‌ ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిస‌న్‌పై మ‌రోసారి విరుచుకుప‌డ్డాడు. కరోనా విజృంభణతో భారత్‌...
05-05-2021
May 05, 2021, 17:39 IST
ఢిల్లీ: కరోనా కారణంగా ఐపీఎల్‌ 2021 రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌...
05-05-2021
May 05, 2021, 16:52 IST
చెన్నై: ఐపీఎల్‌ 14వ సీజన్‌లో సీఎస్‌కే దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 5 విజయాలు.. రెండు...
05-05-2021
May 05, 2021, 16:18 IST
లండన్‌: బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌కు కరోనా సెగ తగలడంతో సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం...
05-05-2021
May 05, 2021, 08:00 IST
యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ని వేదికగా చేసుకొని విజయవంతంగా టోర్నీని ముగించింది.
05-05-2021
May 05, 2021, 07:46 IST
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ విజృంభణ నేపథ్యంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు వరుసగా కరోనా...
05-05-2021
May 05, 2021, 00:30 IST
ముంబై: ఐపీఎల్‌ అనూహ్యంగా వాయిదా పడటంతో దీనికి సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలపై చర్చ మొదలైంది. లీగ్‌ ఆగిపోవడంతో బీసీసీఐకి సుమారు...
04-05-2021
May 04, 2021, 22:08 IST
ముంబై: భారత్‌లో కరోనా బాధితులను ఆదుకునేందుకు పలువురు క్రికెటర్లు ముందుకు వస్తూనే ఉన్నారు. కొవిడ్‌పై భారత్‌ పోరాటానికి సహాయ పడేందుకు ఐపీఎల్‌...
04-05-2021
May 04, 2021, 21:33 IST
ఐపీఎల్‌ వాయిదా తర్వాత ట్వీట్‌ చేసిన సఫారీ పేసర్‌
04-05-2021
May 04, 2021, 21:15 IST
న్యూఢిల్లీ: బీసీసీఐ ఎంతో ప్రతిష్మాత్మకంగా నిర్వహిస్తున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ కరోనా పుణ్యానా రద్దు చేయాల్సి వచ్చింది. సోమవారం కేకేఆర్‌ ఆటగాళ్లు...
04-05-2021
May 04, 2021, 19:32 IST
ఢిల్లీ: సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా ఐపీఎల్‌ 14వ సీజన్‌లో ఆకట్టుకునే ప్రదర్శనను నమోదు చేశాడు. 7 మ్యాచ్‌లాడి 131 పరుగులు...
04-05-2021
May 04, 2021, 18:53 IST
ఢిల్లీ:  టీమిండియా ఆల్‌రౌండర్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు రవీంద్ర జడేజా ప్రశంసల వర్షం కురిపించాడు న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌...
04-05-2021
May 04, 2021, 18:14 IST
లండన్‌: ఐపీఎల్‌ 14వ సీజన్‌ను బీసీసీఐ నిరవధిక వాయిదా వేస్తూ మంగళవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో...
04-05-2021
May 04, 2021, 18:06 IST
మీరు రాకండి.. భారత్‌లోనే ఉండండి: సీఏ
04-05-2021
May 04, 2021, 17:06 IST
మరో 10 రోజుల్లో ఐపీఎల్‌ రీషెడ్యూల్‌?
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top