ఐపీఎల్‌ 2021: సీఎస్‌కే ఖాతాలో వరుసగా ఐదో విజయం

IPL 2021: CSK VS SRH Match Live Upates Telugu - Sakshi

సీఎస్‌కే ఖాతాలో వరుసగా ఐదో విజయం
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించి వరుసగా ఐదో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. సీఎస్‌కే బ్యాటింగ్‌లో ఓపెనర్లు రుతురాజ్‌ 75, డుప్లెసిస్‌ 56 పరుగులతో తొలి వికెట్‌కు 129 పరుగుల జోడించి విజయానికి బాటలు వేశారు. ఓపెనర్లు వెనుదిరిగిన అనంతరం  రైనా(17*) రవీంద్ర జడేజా(7*) మిగతా పనిని పూర్తి చేశారు. ఎస్ఆర్‌హెచ్‌ బౌలర్లలో  రషీద్‌ ఖాన్‌ 3వికెట్లు తీశాడు. 

అంతకముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌లో పాండే 61 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వార్నర్‌ 55 పరుగులు చేశాడు. ఇక చివర్లో కేన్‌ విలియమ్సన్‌ (10 బంతుల్లో 26, 4 ఫోర్లు,1 సిక్స్‌) ,కేదార్‌ జాదవ్‌ 12 పరుగులు( 1 ఫోర్‌, 1 సిక్స్‌)తో ధాటిగా ఆడడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సీఎస్‌కే బౌలర్లలో ఎన్గిడి 2, సామ్‌ కరన్‌ ఒక వికెట్‌ తీశాడు

ఒకే ఓవర్లో రెండు వికెట్లు
లక్ష్యం దిశగా సాగుతున్న సీఎస్‌కే రషీద్‌ ఖాన్‌ వేసిన ఇన్నిం‍గ్స్‌ 15వ ఓవర్లో వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. మొదట మొయిన్‌ అలీని క్యాచ్‌ అవుట్‌ చేసిన రషీద్‌ తన తర్వాతి బంతికి 56 పరుగులు చేసిన డుప్లెసిస్‌ను ఎల్బీగా పెవిలియన​ చేర్చాడు. ప్రస్తుతం సీఎస్‌కే స్కోరు 15 ఓవర్లలో 150/3గా ఉంది.

ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌(75) రూపంలో సీఎస్‌కే తొలి వికెట్‌ కోల్పోయింది. రషీద్‌ ఖాన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో రుతురాజ్‌ క్లీన్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. దీంతో 129 పరుగుల తొలి వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. ప్రస్తుతం సీఎస్‌కే 14 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 137 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ 54, మొయిన్‌ అలీ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు.

12ఓవర్లలో సీఎస్‌కే స్కోరు 115/0
ఎస్‌ఆర్‌హెచ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సీఎస్‌కే దూకుడు ప్రదర్శిస్తుంది. ఓపెనర్లు రుతురాజ్‌, డుప్లెసిస్‌లు హాఫ్‌ సెంచరీలతో మెరవడంతో లక్ష్యం దిశగా సాగుతుంది. ప్రస్తుతం 12 ఓవర్లలో సీఎస్‌కే స్కోరు 115/0 గా ఉంది.

6 ఓవర్లలో సీఎస్‌కే స్కోరు 50/0
172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 50 పరుగులు చేసింది. డెప్లెసిస్‌ 32, రుతురాజ్‌ 17 పరుగులతో ఆడుతున్నారు.

సీఎస్‌కే టార్గెట్‌ 172
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌లో పాండే 61 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. వార్నర్‌ 55 పరుగులు చేశాడు. ఇక చివర్లో కేన్‌ విలియమ్సన్‌ (10 బంతుల్లో 26, 4 ఫోర్లు,1 సిక్స్‌) ,కేదార్‌ జాదవ్‌ 12 పరుగులు( 1 ఫోర్‌, 1 సిక్స్‌)తో ధాటిగా ఆడడంతో ఎస్‌ఆర్‌హెచ్‌ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. సీఎస్‌కే బౌలర్లలో ఎన్గిడి 2, సామ్‌ కరన్‌ ఒక వికెట్‌ తీశాడు.

వెనువెంటనే రెండు వికెట్లు.. ఎస్‌ఆర్‌హెచ్‌ 134/3
ఎస్‌ఆర్‌హెచ్‌ వెనువెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. ఎన్గిడి వేసిన ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో తొలుత హాఫ్‌ సెంచరీ చేసిన వార్నర్‌(55)ను పెవిలియన్‌కు పంపించగా.. ఆ తర్వాత 61 పరుగులు చేసిన పాండే డెప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 18 ఓవర్లలో 138/3గా ఉంది.

ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాట్స్‌మెన్‌ మనీష్‌ పాండే, డేవిడ్‌ వార్నర్‌లు హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో సిక్స్‌ ద్వారా వార్నర్‌(51 బంతుల్లో 55, 3ఫోర్లు, 2 సిక్సర్లు) ఐపీఎల్‌లో 5ంవ అర్థ శతకాన్ని సాధించగా.. అంతకముందు జడేజా వేసిన ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌లో పాండే ఈ మార్క్‌ను అందుకున్నాడు. 35 బంతులాడి 50 పరుగులు చేసిన పాండే ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు. ఒక సిక్సర్‌ ఉన్నాయి. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ 16 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 121 పరుగులు చేసింది. వార్నర్‌ 55, పాండే 52 పరుగులతో క్రీజులో ఉన్నారు.

నిలకడగా సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌.. 82/1
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ నిలకడగా ఆడుతుంది. 22 పరుగుల వద్ద బెయిర్‌ స్టో వికెట్‌ కోల్పోయిన తర్వాత వార్నర్‌, మనీష్‌ పాండేలు మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. 12 ఓవర్ల ఆట ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ ఒక వికెట్‌ నష్టపోయి 82 పరుగులు చేసింది. వార్నర్‌ 38, పాండే 33 పరుగులతో క్రీజులో ఉన్నారు.

8 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 54/1
8 ఓవర్ల ఆట ముగిసేసరికి ఎస్‌ఆర్‌హెచ్‌ వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. వార్నర్‌ 27, పాండే 17 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు స్కోరు 22 పరుగుల వద్ద ఉన్నప్పుడు 7 పరుగులు చేసిన బెయిర్‌ స్టో సామ్‌ కరన్‌ బౌలింగ్‌లో అవుటయ్యాడు.

ఎస్‌ఆర్‌హెచ్‌ తొలి వికెట్‌ డౌన్‌
సీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. సామ్‌ కరన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 4వ ఓవర్లో 7 పరుగులు చేసిన బెయిర్‌ స్టో చహర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం 4 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ స్కోరు 25/1గా ఉంది. వార్నర్‌ 15, పాండే 0 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఢిల్లీ: ఐపీఎల్ 2021 సీజన్‌లో నేడు సీఎస్‌కే, ఎస్‌ఆర్‌హెచ్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది. తొలి మ్యాచ్‌లో ఓడి ఆపై వరుసగా నాలుగు విజయాలతో సీఎస్‌కే దుమ్మురేపుతుంది. మరోవైపు సన్‌రైజర్స్ హైదరబాద్ ఆడిన ఐదు మ్యాచ్‌లకిగానూ కేవలం ఒకే ఒక మ్యాచ్‌లో మాత్రమే గెలుపొంది తీవ్ర ఒత్తిడిలో ఉంది. ఇక టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. 

ఇరు జట్ల ముఖాముఖి పోరు చూసుకుంటే ఎస్‌ఆర్‌హెచ్‌పై సీఎస్‌కే ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 14 మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇందులో ఏకంగా 10 మ్యాచ్‌ల్లో చెన్నై టీమ్ విజయం సాధించింది. మిగిలిన 4 మ్యాచ్‌ల్లో హైదరాబాద్ గెలుపొందింది. ఇక హైదరాబాద్‌‌పై ఇప్పటి వరకూ చెన్నై చేసిన అత్యధిక స్కోరు 223 పరుగులు కాగా.. చెన్నైపై హైదరాబాద్ టీమ్ చేసిన అత్యధిక స్కోరు 192 పరుగులుగా ఉంది. గత సీజన్‌లో ఇరు జట్లు రెండుసార్లు తలపడగా.. చెరో మ్యాచ్‌ను గెలుచుకున్నాయి.

సీఎస్‌కే: డుప్లెసిస్‌, రుతురాజ్‌, మొయిన్‌ అలీ, సురేశ్‌ రైనా, అంబటి రాయుడు, మహేంద్ర సింగ్‌ ధోని, రవీంద్ర జడేజా, లుంగీ ఎన్గిడి, సామ్‌ కర్రన్‌, శార్ధూల్‌ ఠాకూర్‌, చాహర్‌

ఎస్‌ఆర్‌హెచ్‌ : డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌),  కేన్‌ విలియమ్సన్‌, కేదార్‌ జాదవ్‌, విజయ్ శంకర్, జానీ బెయిర్‌ స్టో, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్,మనీష్‌ పాండే, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top