RCB Vs RR : మ్యాక్స్‌వెల్‌ మెరుపులు.. ఆర్‌సీబీ ఘన విజయం

IPL 2021 2nd Phase RCB Vs Rajastan Royals Live Updates And Highlights - Sakshi

మ్యాక్స్‌వెల్‌ మెరుపులు.. ఆర్‌సీబీ ఘన విజయం
రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ ఘన విజయం సాధించింది. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (30 బంతుల్లో 50 పరుగులు, 6 ఫోర్లు, 1 సిక్స్‌)తో మెరుపులు మెరిపించడంతో ఆర్‌సీబీ 17.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 150 పరుగుల లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు వికెట్‌ కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ 44 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. 

కాగా తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆరంభంలో ఎవిన్‌ లూయిస్‌ ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు ఖాయం అనుకున్న దశలో రాజస్తాన్‌ మాత్రం నామమాత్రపు స్కోరు చేసింది. లూయిస్‌ ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్స్‌ పూర్తిగా విఫలమయ్యారు. 13 ఓవర్లు ముగిసేసరికి 113/2తో పటిష్టంగా కనిపించిన రాజస్తాన్‌ మిగిలిన 7 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్ 3‌, చహల్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలా రెండు వికెట్లు తీశారు. 

14 ఓవర్లలో ఆర్‌సీబీ స్కోరు 115/2
14 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌సీబీ 2 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. ఓపెనర్‌ శ్రీకర్‌ భరత్ 39 పరుగులతో ఆడుతుండగా.. మ్యాక్స్‌వెల్‌ 21 పరుగులతో సహకరిస్తున్నాడు. అంతకముందు కోహ్లి 25 పరుగుల వద్ద రనౌట్‌ కాగా.. పడిక్కల్‌ 22 పరుగుల వద్ద ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు.

కోహ్లి రనౌట్‌.. ఆర్‌సీబీ 58/2
ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌ ఐదో బంతిని కోహ్లి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశగా ఆడాడు. అయితే అక్కడే ఉన్న రియాన్‌ పరాగ్‌ బంతిని అందుకొని నేరుగా వికెట్ల వైపు విసిరాడు. దీంతో డైరెక్ట్‌ త్రోకు కోహ్లి రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం 8 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 66 పరుగులు చేసింది.

పడిక్కల్‌ క్లీన్‌ బౌల్డ్‌.. తొలి వికెట్‌ కోల్పోయిన ఆర్‌సీబీ
150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్‌సీబీ తొలి వికెట్‌ను కోల్పోయింది. 22 పరుగులు చేసిన దేవదత్‌ పడిక్కల్‌ ముస్తాఫిజుర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఆర్‌సీబీ 6 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది. కోహ్లి 23 పరుగులు, శ్రీకర్‌ భరత్‌ 3 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఆర్‌సీబీ టార్గెట్‌ 150
ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఆరంభంలో ఎవిన్‌ లూయిస్‌ ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించడంతో భారీ స్కోరు ఖాయం అనుకున్న దశలో రాజస్తాన్‌ మాత్రం నామమాత్రపు స్కోరు చేసింది. లూయిస్‌ ఔటైన తర్వాత మిగిలిన బ్యాటర్స్‌ పూర్తిగా విఫలమయ్యారు. 13 ఓవర్లు ముగిసేసరికి 113/2తో పటిష్టంగా కనిపించిన రాజస్తాన్‌ మిగిలిన 7 ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. ఆర్‌సీబీ బౌలర్లలో హర్షల్‌ పటేల్ 3‌, చహల్‌, షాబాజ్‌ అహ్మద్‌ తలా రెండు వికెట్లు తీశారు. 

ఆరో వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌.. లివింగ్‌స్టోన్‌(6) ఔట్
ఆర్సీబీ బౌలర్‌ చహల్‌.. రాజస్తాన్‌ను మరో దెబ్బ కొట్టాడు. 16.2 ఓవర్‌లో డేంజరెస్‌ బ్యాటర్‌ లివింగ్‌స్టోన్‌(9 బంతుల్లో 6)ను ఔట్‌ చేశాడు. ఫలితంగా రాజస్తాన్‌ 127 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి భారీ స్కోర్‌పై ఆశలు వదులుకుంది. క్రీజ్‌లో రియాన్‌ పరాగ్‌(5), క్రిస్‌ మోరిస్‌ ఉన్నారు. 


Photo Courtesy: IPL

4 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన రాజస్తాన్‌
ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, ఎవిన్‌ లూయిస్‌ అందించిన శుభారంభాన్ని రాజస్తాన్‌ మిడిలార్డర్‌ సద్వినియోగం చేసుకోలేకపోయింది. 4 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 12.5 ఓవర్లో లోమ్రార్‌(4 బంతుల్లో 3)ను చహల్‌ బోల్తా కొట్టించగా, ఆ మరుసటి ఓవర్‌లో షాబజ్‌ అహ్మద్‌.. శాంసన్‌(15 బంతుల్లో 19; 2 సిక్సర్లు), తెవాతియా(3 బంతుల్లో 2)లను పెవిలియన్‌కు పంపాడు. 14ఓవర్ల తర్వాత రాజస్తాన్‌ స్కోర్‌ 117/5. క్రీజ్‌లో లివింగ్‌స్టోన్‌(2), రియాన్‌ పరాగ్‌ ఉన్నారు. 

లూయిస్‌ విధ్వంసానికి బ్రేక్‌.. రాజస్తాన్‌ రెండో వికెట్‌ డౌన్‌    
ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి ధాటిగా ఆడుతూ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించిన రాజస్తాన్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ (37 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఎట్టకేలకు 12వ ఓవర్‌లో ఔటయ్యాడు. జార్జ్‌ గార్టన్‌ బౌలింగ్లో వికెట్‌కీపర్‌ శ్రీకర్‌ భరత్‌ క్యాచ్‌ పట్టడంతో లూయిస్‌ వెనుదిరిగాడు. 11.1 ఓవర్ల తర్వాత రాజస్తాన్‌ స్కోర్‌ 100/1. క్రీజ్‌లో శాంసన్‌(10), లోమ్రార్‌ ఉన్నారు.


Photo Courtesy: IPL

లూయిస్‌ అర్థసెంచరీ.. రాజస్తాన్‌ 100/1
రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌ ఎవిన్‌ లూయిస్‌ మెరుపు అర్థసెంచరీ సాధించాడు. 31 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్న లూయిస్‌ ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం రాజస్తాన్‌ 11 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 100 పరుగులు చేసింది. లూయిస్‌ 58, శాంసన్‌ 8 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

తొలి వికెట్‌ కోల్పోయిన రాజస్తాన్‌.. 9 ఓవర్లలో 81/1
యశస్వి జైశ్వాల్‌(25) రూపంలో రాజస్తాన్‌ రాయల్స్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. డేనియల్‌ క్రిస్టియన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 9వ ఓవర్‌ రెండో బంతిని యశస్వి భారీ షాట్‌ ఆడే ప్రయత్నంలో సిరాజ్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం రాజస్తాన్‌ 9 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 81 పరుగులు చేసింది. లూయిస్‌ 47, శాంసన్‌ 2 పరుగులతో ఆడుతున్నారు. 

దాటిగా ఆడుతున్న రాయల్స్‌
రాజస్తాన్‌ రాయల్స్‌ ఓపెనర్లు ఎవిన్‌ లూయిస్‌, యశస్వి జైశ్వాల్‌లు దాటిగా ఆడుతున్నారు. ముఖ్యంగా లూయిస్‌ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపిస్తున్నాడు. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్లో 6,4,6తో విరుచుకుపడిన లూయిస్‌ తర్వాతి ఓవర్లోనూ ఫోర్‌, సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం 6 ఓవర్ల ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. లూయిస్‌ 41, జైశ్వాల్‌ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు.

2 ఓవర్లు ముగిసేసరికి ఆర్‌ఆర్‌ స్కోరు 8/0
ఆర్‌సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 2 ఓవర్లు ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. ఎవిన్‌ లూయిస్‌ 4, జైశ్వాల్‌ 4 పరుగలుతో ఆడుతున్నారు.


Photo Courtesy: IPL

దుబాయ్‌: ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా నేడు ఆర్‌సీబీ, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఆసక్తికర మ్యాచ్‌ జరగనుంది. టాస్‌ గెలిచిన ఆర్‌సీబీ బౌలింగ్‌ ఎంచుకుంది. గత మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించిన ఆర్‌సీబీ కొత్త జోష్‌లో కనిపిస్తుండగా.. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ ఓటమి పాలై ఒత్తిడిలో ఉంది. ఇక పాయింట్ల పట్టికలో ఆర్‌సీబీ మూడో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్‌ రాయల్స్‌ ఏడో స్థానంలో ఉంది.

తొలి అంచె పోటీల్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీని విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ పది వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. దేవదత్‌ పడిక్కల్‌  సెంచరీ(102 నాటౌట్‌), విరాట్‌ కోహ్లి(72 నాటౌట్‌) మెరుపులు మెరిపించారు. ఓవరాల్‌గా ఇరు జట్లు ముఖాముఖి పోరులో ఇప్పటివరకు 23సార్లు తలపడగా.. 11 సార్లు ఆర్‌సీబీ గెలవగా.. 10 సార్లు రాజస్తాన్‌ను విజయం వరించింది. ఇక చివరగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఆర్‌సీబీనే విజయం సాధించడం విశేషం.

రాజస్థాన్ రాయల్స్: ఎవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), లియామ్ లివింగ్‌స్టోన్, మహిపాల్ లామ్రోర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాటియా, క్రిస్ మోరిస్, కార్తీక్ త్యాగి, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రెహమాన్‌

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ (కెప్టెన్‌), దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భారత్ (వికెట్‌ కీపర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, ఎబి డివిలియర్స్, డేనియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చహల్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top