థియేట‌ర్ల‌లో వ‌ర‌ల్డ్ క‌ప్ క్రికెట్‌ మ్యాచ్‌లు.. ఐసీసీతో ఐనాక్స్‌ ఒప్పందం

INOX Signs Agreement With ICC To Stream T20 WC Matches - Sakshi

ఆస్ట్రేలియాకు వెళ్లి టీ20 వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించలేని అభిమానులకు ఇదో గుడ్‌ న్యూస్‌. మైదానంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగించే మల్టీప్లెక్స్‌ల్లో వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ మేరకు ఐసీసీతో దేశీయ మల్టీప్లెక్స్‌ దిగ్గజం ఐనాక్స్‌ ఒప్పందం కదుర్చుకుంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భార‌త్ ఆడే అన్ని మ్యాచ్‌ల‌తో పాటు సెమీ ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచ్‌ల‌ను ఐనాక్స్ త‌న మ‌ల్టీప్లెక్స్‌ల్లో  ప్ర‌సారం చేయ‌నుంది. 

అయితే ఐసీసీతో ఒప్పందం మేరకు ఈ లైవ్‌ స్ట్రీమింగ్‌ను దేశంలోని 25 నగరాలకే పరిమితం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ 25 నగరాల జాబితాను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఐనాక్స్‌ ప్రతినిధులు తెలిపారు. 

ఇదిలా ఉంటే, ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ సూపర్‌-12 మ్యాచ్‌లు ఈనెల 22 నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈనెల 23న భారత్‌.. తమ తొలి సమరంలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడనుంది. ఆతర్వాత 27న గ్రూప్‌-ఏలో రెండో స్థానంలో ఉన్న జట్టుతో, 30న సౌతాఫ్రికాతో, నవంబర్‌ 2న బంగ్లాదేశ్‌తో, నవంబర్‌ 6న గ్రూప్‌-బిలో తొలి స్థానంలో ఉన్న జట్లతో తలపడనుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top