మరొకటి గెలిస్తే మెయిన్‌ ‘డ్రా’లోకి...  | Sakshi
Sakshi News home page

మరొకటి గెలిస్తే మెయిన్‌ ‘డ్రా’లోకి... 

Published Fri, Jan 12 2024 4:17 AM

Indias number one Sumit Nagal qualified for the final round - Sakshi

ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ క్వాలిఫయింగ్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత నంబర్‌వన్‌ సుమిత్‌ నగాల్‌ ఫైనల్‌ రౌండ్‌కు అర్హత సాధించాడు. మెల్‌బోర్న్‌లో గురువారం జరిగిన పురుషుల సింగిల్స్‌  రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ 139వ ర్యాంకర్‌ సుమిత్‌ 6–3, 6–2తో ‘వైల్డ్‌ కార్డు’ ప్లేయర్‌ ఎడ్వర్డ్‌ వింటర్‌ (ఆ్రస్టేలియా)పై  గెలుపొందాడు. 64 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సుమిత్‌ ప్రత్యర్థి సర్విస్‌ను ఐదుసార్లు బ్రేక్‌ చేశాడు.

12 విన్నర్స్‌ కొట్టిన సుమిత్‌ 11 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్‌వద్దకు 14 సార్లు దూసుకొచ్చి 10 సార్లు పాయింట్లు గెలిచాడు. 118వ ర్యాంకర్‌ మోల్కన్‌ (స్లొవేకియా)తో నేడు జరిగే ఫైనల్‌ రౌండ్‌ మ్యాచ్‌లో సుమిత్‌ నెగ్గితే రెండోసారి ఆ్రస్టేలియన్‌ ఓపెన్‌ టోర్నీలో మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధిస్తాడు. సుమిత్‌ 2019, 2020 యూఎస్‌ ఓపెన్‌లో, 2021 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మెయిన్‌ ‘డ్రా’లో పోటీపడ్డాడు. 

Advertisement
 
Advertisement
 
Advertisement