‘షూటౌట్‌’లో భారత్‌ ఓటమి  | Indian Women Lose to Ireland in Shootout in Pro hockey league 2022 | Sakshi
Sakshi News home page

Pro hockey league 2022: ‘షూటౌట్‌’లో భారత్‌ ఓటమి 

Mar 13 2022 11:23 AM | Updated on Mar 13 2022 11:27 AM

Indian Women Lose to Ireland in Shootout in Pro hockey league 2022 - Sakshi

భువనేశ్వర్‌: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా జర్మనీ మహిళల జట్టుతో శనివారం జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో భారత జట్టు ‘షూటౌట్‌’లో 1–2 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. అంతకుముందు నిర్ణీత సమయం ముగిసేసరికి రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ‘షూటౌట్‌’లో నెగ్గిన జర్మనీకి రెండు పాయింట్లు, భారత్‌కు ఒక పాయింట్‌ లభించాయి. 

సాకేత్‌ ఖాతాలో 26వ డబుల్స్‌ టైటిల్‌ 
సాక్షి, హైదరాబాద్‌: భారత డేవిస్‌కప్‌ జట్టు సభ్యుడు, ఆంధ్రప్రదేశ్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సాకేత్‌ మైనేని తన కెరీర్‌లో 26వ అంతర్జాతీయ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. శనివారం భోపాల్‌లో ముగిసిన అంతర్జాతీయ టెన్నిస్‌ సమాఖ్య (ఐటీఎఫ్‌) టోర్నీలో సాకేత్‌–యూకీ బాంబ్రీ (భారత్‌) జంట విజేతగా నిలిచింది. 56 నిమిషాల్లో ముగిసిన ఫైనల్లో సాకేత్‌–యూకీ బాంబ్రీ ద్వయం 6–4, 6–1తో లోహితాక్ష–అభినవ్‌ సంజీవ్‌ (భారత్‌) జోడీపై గెలిచింది.

చదవండి: IND vs SL: అశ్విన్‌ ఏం చేస్తున్నావు.. ఏంటి ఆ పని..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement