అబ్బాయిలు 13–1తో... అమ్మాయిలు 25–0తో... | Indian teams enter semi finals of Asia Cup Under 18 Hockey Tournament | Sakshi
Sakshi News home page

అబ్బాయిలు 13–1తో... అమ్మాయిలు 25–0తో...

Jun 4 2026 3:20 AM | Updated on Jun 4 2026 3:20 AM

Indian teams enter semi finals of Asia Cup Under 18 Hockey Tournament

కాకమిగహర (జపాన్‌): ఆసియా కప్‌ అండర్‌–18 హాకీ టోర్నమెంట్‌లో అటు పురుషుల విభాగంలో, ఇటు మహిళల విభాగంలో భారత జట్లు సత్తా చాటి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల మ్యాచ్‌లో భారత్‌ 13–1 తేడాతో చైనీస్‌ తైపీపై ఘన విజయం సాధించింది. భారత్‌ తరఫున ఆశిష్‌ పుర్తి (27వ నిమిషం, 35, 42) మూడు గోల్స్‌ సాధించగా... రాహుల్‌ యాదవ్‌ (20, 54), సిద్ధార్త్‌ బెన్‌ (30, 52), గాజీ ఖాన్‌ (40, 44) తలా 2 గోల్స్‌ నమోదు చేశారు. 

కరణ్‌ గౌతమ్‌ (7), ప్రేమ్‌చంద్‌ (11), కేతన్‌ కుశ్వాహ (13), వరీందర్‌ సింగ్‌ (50) ఒక్కో గోల్‌ కొట్టారు. తైపీ తరఫున యోంగ్‌ యున్‌ జాంగ్‌ (30) ఏకైక గోల్‌ సాధించాడు. మహిళల పోరులో భారత్‌ 25–0తో సింగపూర్‌ను చిత్తు చేసింది. భారత ప్లేయర్లలో నౌషీన్‌ నాజ్‌ (8వ నిమిషం, 13, 17, 18, 40, 52, 58) ఏకంగా 7 గోల్స్‌ కొట్టగా...గీతశ్రీ (13, 28, 47, 48, 60) 5 గోల్స్‌ సాధించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement