
మ్యూనిక్: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ పతకాల ఖాతా తెరిచింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో భారత షూటర్ సరబ్‌జోత్ సింగ్ స్వర్ణ పతకాన్ని సాధించాడు.
వరల్డ్ చాంపియన్, నాలుగుసార్లు ఒలింపియన్ తదితర మేటి షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో 22 ఏళ్ల సరబ్‌జోత్ 242.7 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు. బు షుహైహాంగ్ (చైనా; 242.5 పాయింట్లు) రజతం నెగ్గగా... రాబిన్ వాల్టర్ (జర్మనీ; 220 పాయింట్లు) కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు.