ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. భరత్‌పై వేటు! సర్ఫరాజ్‌, దృవ్‌ అరంగేట్రం? | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌తో మూడో టెస్టు.. భరత్‌పై వేటు! సర్ఫరాజ్‌, దృవ్‌ అరంగేట్రం?

Published Mon, Feb 12 2024 12:51 PM

Indian Cricket Team playing XI for 3rd test vs England, Rajkot Predicted - Sakshi

ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. ఇప్పుడు పర్యాటక జట్టుతో మరో కీలక పోరుకు సిద్దమైంది. ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో ఇంగ్లండ్‌తో అమీతుమీ తెల్చుకోనుంది. ఈమ్యాచ్‌లో గెలిచి సిరీస​ ఆధిక్యాన్ని పెంచుకోవాలని రోహిత్‌ సేన భావిస్తుంటే.. మరోవైపు ఇంగ్లండ్‌ సైతం తమ ఆస్త్రాలను సిద్దం​ చేసుకుంటుంది.

ఇప్పటికే భారత జట్టు రాజ్‌కోట్‌కు చేరుకోగా.. దుబాయ్‌లో ఉన్న ఇంగ్లీష్‌ జట్టు మంగళవారం రాజ్‌కోట్‌కు రానుంది. అయితే చివరి మూడు టెస్టులకు తాజాగా భారత జట్టును ప్రకటించిన సెలక్టర్లు కొన్ని అనూహ్య మార్పులు చేశారు. శ్రేయస్‌ అయ్యర్, అవేష్‌ ఖాన్‌ను జట్టు నుంచి తప్పించిన సెలక్టర్లు.. ఆకాష్‌ దీప్‌ను తొలిసారి టెస్టు జట్టుకు ఎంపిక చేశారు.

అదే విధంగా రెండో టెస్టుకు గాయం కారణంగా దూరమైన స్టార్‌ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్‌ రాహుల్‌ తిరిగి జట్టులోకి వచ్చారు. అయితే వారిద్దరూ మూడో టెస్టుకు అందుబాటులో ఉండేది అనుమానమే. ఈ తుది జట్టు సెలక్షన్‌కు ముందు వారిద్దరూ తమ ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంది. మరోవైపు రెండో టెస్టుకు భారత జట్టులో కలిసిన సర్ఫరాజ్‌ ఖాన్‌, వాషింగ్టన్‌ సుందర్‌లను ఆఖరి మ్యాచ్‌ల

దృవ్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌ అరంగేట్రం
ఇక రాజ్‌కోట్‌ టెస్టుతో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దృవ్‌ జురల్‌, సర్ఫరాజ్‌ ఖాన్‌​ అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా విఫలమవుతున్న ఆంధ్ర వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ శ్రీకర్‌ భరత్‌పై వేటు వేసి, దృవ్‌ జురల్‌ను జట్టులోకి తీసుకోవాలని మేన్‌జ్‌మెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. తొలి రెండు టెస్టుల్లో భరత్‌ నిరాశపరిచాడు. 

నాలుగు ఇన్నింగ్స్‌ల్లో భరత్.. 41, 28, 17, 6 చేసిన స్కోర్లు ఇవి.  ఇప్పటివరకు తన కెరీర్‌లో 7 టెస్టు మ్యాచ్‌లు ఆడిన భరత్‌కు 12 సార్లు బ్యాటింగ్‌ చేసే ఛాన్స్‌ లభించింది. అతడి ఇన్నింగ్స్‌లో 20 సగటుతో మొత్తంగా 221 పరుగులు మాత్రమే  చేశాడు.

ఇందులో ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదు. మరోవైపు వైజాగ్‌ టెస్టుతో అరంగేట్రం చేసిన రజిత్‌ పాటిదార్‌ను కూడా పక్కన పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో అరంగేట్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌ ఖాన్‌కు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. అదేవిధంగా రెండో టెస్టుకు దూరమైన పేసర్‌ సిరాజ్‌ కూడా తుది జట్టులోకి రానున్నాడు. ఈ క్రమంలో ముఖేష్‌ కుమార్‌ బెంచ్‌కే పరిమితం కానున్నాడు.

భారత తుది జట్టు(అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌, సర్ఫరాజ్ ఖాన్, అక్షర్ పటేల్, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్

 
Advertisement
 
Advertisement