IND VS PAK: ఆస్ట్రేలియా వేదికగా భారత్‌-పాక్‌ వన్డే సిరీస్‌..?

India Vs Pakistan: Australia To host Arch Rivals In Tri Series - Sakshi

Australia To host India, Pakistan In Tri Series: చిరకాల ప్రత్యర్ధులైన భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య పోరుకు సంబంధించి క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) కీలక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియా వేదికగా దాయాదులతో కలుపుకుని ముక్కోణపు సిరీస్‌ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సీఏ చీఫ్ నిక్ హాక్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్‌-పాక్‌లు చివరిసారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడ్డాయి. 

అయితే, ఆసీస్‌ క్రికెట్‌ చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలతో భారత, పాక్‌ క్రికెట్ అభిమానుల్లో ఈ అంశానికి సంబంధించిన చర్చ ఒక్కసారిగా ఊపందుకుంది. ఇదే విషయాన్ని పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రాజా ఈ ఏడాది జనవరిలో ప్రతిపాదించాడు. అయితే, మూడు దేశాలు కాకుండా ఇంగ్లండ్‌ను కలుపుకుని నాలుగు దేశాల సిరీస్‌ను ఏర్పాటు చేయాలని  రమీజ్‌ రాజా ఐసీసీని కోరాడు. తాజాగా హాక్లీ వ్యాఖ్యలతో మరోసారి భారత్‌-పాక్‌ సిరీస్‌ అంశం తెరపైకి వచ్చింది. 

ఇదిలా ఉంటే, భారత్-పాకిస్థాన్ మధ్య ముక్కోణపు సిరీస్ జరగడం దాదాపుగా అసాధ్యమని భారత క్రికెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2023 వరకు టీమిండియా షెడ్యూల్ ఇప్పటికే ఖరారు కావడం ఇందుకు కారణమని తెలుస్తోంది. కాగా, ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత్‌-పాక్‌లు తలపడనున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 23న జరగనున్న ఈ మ్యాచ్‌కు సంబంధించి ఇదివరకే టిక్కెట్లన్నీ అమ్ముడుపోయాయి. 
చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన టీమిండియా వివాదాస్పద బౌలర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top