ఆసీస్‌తో భారత్‌ రెండో వన్డే..

India Vs Australia Second One Day Australia Batting - Sakshi

సిడ్నీ :  భారత్‌ బ్యాటింగ్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌

• ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఎదురీదుతుంది. ఇప్పటివరకు 38 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 46, పాండ్యా 9 పరుగులతో క్రీజులో        ఉన్నారు. అంతకముందు కెప్టెన్‌ కోహ్లి సిడ్నీ గ్రౌండ్‌లో తొలిసారి ఆకట్టుకునే ఇన్నింగ్స్‌ ఆడాడు. 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 89 పరుగులు చేసిన కోహ్లి హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో  హెన్రిక్స్‌ పట్టిన అద్భుతమైన క్యాచ్‌తో‌ అవుట్‌గా వెనుదిరిగాడు.

•  390 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా నిలకడగా ఆడుతుంది. 60 పరుగులకే ఓపెనర్లను కోల్పోయినా కెప్టెన్‌ కోహ్లి, శ్రేయాస్‌ అయ్యర్‌ నిలకడగా ఆడారు. ప్రస్తుతం      23ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కాగా 38 పరుగులు చేసిన అయ్యర్‌ హెన్రిక్స్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 153 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. కాగా కెప్టెన్‌ కోహ్లి 53 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

•  సిడ్నీ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా లక్ష్యచేధనలో తడబడుతున్నట్లుగా అనిపిస్తోంది. 390 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్లు శిఖర్‌     ధవన్‌,మయాంక్‌ అగర్వాల్‌లు శుభారంభం అందించారు. 5 ఓవర్లోలనే భారత్‌ 50 పరుగులు దాటింది. మంచి టచ్‌లో కనిపించిన శిఖర్‌ ధవన్‌ హాజల్‌వుడ్‌ బౌలింగ్‌లో 30 పరుగుల వద్ద స్టార్క్‌కు     క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో టీమిండియా 58 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది. ఆ తర్వాత కాసేపటికే 28 పరుగులు చేసిన మయాంక్‌ కూడా కమిన్స్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్‌గా   వెనుదిరడంతో 60 పరుగుల వద్ద రెండో వికెట్‌ కోల్పోయింది. ప్రస్తుతం టీమిండియా 11 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. కెప్టెన్‌ కోహ్లి 3, అయ్యర్‌ 7 పరుగులతో క్రీజులో   ఉన్నారు. 

ఆసీస్‌ బ్యాటింగ్‌..

  • 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఆసీస్‌ 389 పరుగులు సాధించింది. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్స్‌లో స్మిత్‌ సెంచరీ (104)తో చెలరేగగా.. వార్నర్‌ (83) లబ్‌షేన్‌ 70, మ్యాక్స్‌వెల్‌  29 బంతుల్లో 63, ఫించ్‌ 60 పరుగులతో చెలరేగారు. భారత్‌ ముందు 390 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచారు. టీమిండియా బౌలర్లు మరోసారి ధారాళంగా పరుగులు సమర్పించారు. కాగా ఆస్ట్రేలియా జట్టుకు టీమిండియాపై 389 పరుగులు అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ శుక్రవారం జరిగిన మొదటి వన్డేలో చేసిన 374 పరుగుల రికార్డును ఆసీస్‌ తాజాగా సవరించింది. అంతేకాదు ఆసీస్‌ చివరి 15 ఓవర్లలో టీమిండియా బౌలర్ల నుంచి 159 పరుగులు పిండుకుంది. 

  • భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆసీస్‌ మరోసారి భారీ స్కోరు దశగా పయనిస్తోంది. మొదటి వన్డేలో 374 పరుగులు సాధించిన ఆసీస్‌ రెండో వన్డేలోనూ అదే స్థాయిలో అదరగొడుతుంది. ఇప్పటివరకు 43 ఓవర్లలో ఆస్ట్రేలియా మూడు వికెట్లు మాత్రమే నష్టపోయి 307 పరుగులు దాటింది. లబుషేన్‌ 44, మ్యాక్స్‌వెల్‌ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఇంకా ఏడు ఓవర్ల ఆట మిగిలి ఉండడంతో భారీ స్కోరుపై కన్నేసినట్లు కనిపిస్తోంది.‌ కాగా అంతకముందు దాటిగా ఆడిన స్మిత్‌ వరుసగా రెండో‌ సెంచరీతో మెరిశాడు. ఇప్పటికే మొదటి వన్డేలో సెంచరీ సాధించిన స్మిత్‌ ఈ మ్యాచ్‌లో మరింత దూకుడు ప్రదర్శించాడు. కేవలం 64 బంతుల్లోనే 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసిన స్మిత్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో షమీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఆసీస్‌ 292 పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది.

  • తొలి వన్డేలో భారీ సాధించిన కంగరూ ఆటగాళ్లు.. రెండోవన్డేలోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. 33 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి ఆసీస్‌ 213 పరుగులు సాధించింది. క్రిజ్‌లో స్మిత్‌ 48, లబుషేన్‌ 14 ఆడుతున్నాడు.

  • జోరు మీద ఉన్న ఆసీస్‌ ఓపెనర్ల జోరుకు భారత పేసర్‌ షమీ బ్రేక్‌ వేశాడు. 60 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఫించ్‌ను  ఔట్‌ చేసి భారత్‌కు తుది వికెట్‌ను అందించాడు. దీంతో 152 పరుగులకు ఆసీస్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. సెంచరీ దిశగా దూకుడుగా ఆడుతున్న వార్నర్‌ సైతం వెంటనే రనౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం 27 ఓవర్లుకు రెండు వికెట్ల నష్టానికి ఆసీస్‌ 166 పరుగులు సాధించింది. క్రిజ్‌లో స్మిత్‌తో పాటు లబుషేన్ ఉన్నాడు. 
     
  •  మొదటి మ్యాచ్‌లో పరుగుల వరద పారించిన ఆసీస్‌ ఓపెనర్లు రెండో వన్డేలోనూ అదే జోరు కొనసాగిస్తున్నారు. 15 ఓవర్లు ముగిసే సరికి ఒక్క వికెట్‌ నష్టపోకుండా 97 పరుగుల రాబట్టారు. ఫించ్‌ 45 బంతుల్లో 37 పరుగులు, వార్నర్‌ 50 బంతుల్లో 50 పరుగులు సాధించాడు. వార్నర్‌ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆఫ్‌సెంచరీ సాధించాడు. 
  • తొలి ఆరు ఓవర్లు ముగిసే సమయానికి 40 పరుగులు సాధించింది. ఓపెనర్లు వార్నర్‌ 24 బంతుల్లో 29 పరుగులు, ఫించ్‌ 17 బంతుల్లో 10 పరుగులు క్రిజ్‌లో ఉన్నారు
     
  • భారత్‌-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. టాస్‌ గెలిచి ఆసీస్‌ మరోసారి బ్యాటింగ్‌ వైపే మొగ్గుచూపింది. మూడు వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో ఆసీస్‌ భారీ విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. సిరీస్‌పై పట్టు నిలుపుకోవాలంటే ఈ మ్యాచ్‌లో భారత్‌ తప్పనిసరిగా నెగ్గాలి. మరోవైపు తొలి మ్యాచ్‌ విజయంతో ఆసీస్‌ మరింత ఆత్మవిశ్వాసంతో బరిలో నిలిచింది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ కైవసం చేసుకోవాలని ధీమాతో ఉంది. ఎలాంటి మార్పులు లేకుండానే భారత్‌ బరిలోకి దిగింది. (గెలిస్తేనే సిరీస్‌ ఆశలు సజీవం)

భారత్‌ తుదిజట్టు : శిఖర్ ధావన్‌, మయాంక్‌ అగర్వాల్‌, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్‌ అయ్యర్‌,  కేఎల్‌ రాహుల్‌, హర్థిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, నవదీప్‌ సైనీ, షమీ, బుమ్రా, చహల్‌

ఆసీస్‌ తుది జట్టు : ఆరోన్‌ ఫించ్‌, డేవిడ్‌ వార్నర్‌, స్మిత్‌, మార్నస్‌ లబుషేన్‌, స్టోయినిస్‌, మ్యాక్స్‌వెల్‌, కేరీ, మోయిసెస్ హెన్రిక్యూస్, కమిన్స్‌, స్టార్క్‌‌, జంపా, హెజల్‌వుడ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top