IND vs AUS 4th T20I Updates: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్‌.. సిరీస్‌ సొంతం | India Vs Australia 4th T20I Today Live Updates And Score | Sakshi
Sakshi News home page

India Vs Australia 4th T20I Updates: ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్‌.. సిరీస్‌ సొంతం

Dec 1 2023 6:31 PM | Updated on Dec 1 2023 10:35 PM

India Vs Australia 4th T20I Today Live Updates And Score - Sakshi

ఆస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్‌.. 
రాయ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 20 పరుగుల తేడాతో భారత్‌ విజయం సాధించింది. దీంతో సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలూండగానే 3-1 భారత్‌ సొంతం చేసుకుంది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు మాత్రమే చేసింది. భారత బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ మూడు వికెట్లు, దీపక్‌ చాహర్‌ రెండు, రవి బిష్ణోయ్‌, అవేష్‌ ఖాన్‌ తలా వికెట్‌ సాధించారు.

ఆసీస్‌ బ్యాటర్లలో మాథ్యూ వేడ్‌(36) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్‌లో 9 వికెట్ల నష్టానికి 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రింకూ సింగ్‌ మరోసారి అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

రింకూ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. రింకూతో పాటు జితేష్‌ శర్మ(35), యశస్వీ జైశ్వాల్‌(37), రుతురాజ్‌ గైక్వాడ్‌(32) పరుగులతో రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

ఆసీస్‌ ఏడో వికెట్‌ డౌన్‌..
133 పరుగుల వద్ద ఆసీస్‌ ఏడో వికెట్‌ కోల్పోయింది. బెన్ ద్వార్షుయిస్ (1) అవేష్ ఖాన్ బౌలింగ్ లో క్లీన్‌ బౌల్డయ్యాడు. ఆస్ట్రేలియా 15 బంతుల్లో 42 పరుగులు చేయాల్సి ఉంది

ఆసీస్‌ ఆరో వికెట్‌ డౌన్‌..
126 పరుగుల వద్ద ఆసీస్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది.మాథ్యూ షార్ట్ (22) దీపక్ చాహర్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా  వెనుదిరిగాడు. ఆస్ట్రేలియా 20 బంతుల్లో 49 పరుగులు చేయాల్సి ఉంది

ఆసీస్‌ ఐదో వికెట్‌ డౌన్‌..
107 పరుగుల వద్ద ఆసీస్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. టిమ్‌ డేవిడ్‌ (19) దీపక్ చాహర్ బౌలింగ్ లో క్యాచ్ ఔట్ గా  వెనుదిరిగాడు.క్రీజులోకి మాథ్యూ వేడ్ బ్యాటింగ్ కి వచ్చాడు

ఆసీస్‌ నాలుగో వికెట్‌ డౌన్‌..
87 పరుగుల వద్ద ఆసీస్‌ నాలుగో వికెట్‌ కోల్పోయింది. మెక్‌డెర్మాట్(18) అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి మాథ్యూ షార్ట్‌ వచ్చాడు.

10 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 76/3
10 ఓవర్లు ముగిసే సరికి ఆసీస్‌ 3 వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది. క్రీజులో టిమ్‌ డేవిడ్‌(14), బెన్ మెక్‌డెర్మాట్(10) పరుగులతో ఉన్నారు.

ఆసీస్‌ మూడో వికెట్‌ డౌన్‌..
ఆస్ట్రేలియా మూడో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన హార్దే.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు. క్రీజులోకి టిమ్‌ డేవిడ్‌ వచ్చాడు.

ఆసీస్‌ సెకెండ్‌ వికెట్‌ డౌన్‌..
ట్రావిస్‌ హెడ్‌ రూపంలోఆస్ట్రేలియా రెండో వికెట్‌ కోల్పోయింది. 31 పరుగులు చేసిన హెడ్‌.. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌..
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా తొలి వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన జోష్‌ ఫిలిపి.. బిష్ణోయ్‌ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డయ్యాడు.

2 ఓవర్లకు ఆసీస్‌ స్కోర్‌: 18/0
175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా రెండు ఓవర్లకు వికెట్‌ నష్టపోకుండా 18 పరుగులు చేసింది. క్రీజులో ట్రావిస్‌ హెడ్‌(7), జోష్‌ ఫిలిపి(8) పరుగులతో ఉన్నారు.

రింకూ సూపర్‌ ఇన్నింగ్స్‌.. ఆసీస్‌ టార్గెట్‌ 175 పరుగులు
రాయ్‌పూర్‌ వేదికగా ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రింకూ సింగ్‌ మరోసారి అద్బుత ఇన్నింగ్స్‌ ఆడాడు.

రింకూ 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు చేశాడు. రింకూతో పాటు జితేష్‌ శర్మ(35), యశస్వీ జైశ్వాల్‌(37), రుతురాజ్‌ గైక్వాడ్‌(32) పరుగులతో రాణించారు. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌(1), శ్రేయస్‌ అయ్యర్‌(8) పరుగులతో రాణించారు. ఆసీస్‌ బౌలర్లలో బెన్ ద్వార్షుయిస్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సంగా తలా రెండు వికెట్లు పడగొట్టారు.

17 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 147/4
17 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 4 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. 

జితేష్‌ మెరుపులు.. 15 ఓవర్లకు బారత్‌ స్కోర్‌: 129/4
రుతు ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన జితేష్‌ శర్మ మెరుపులు మెరిపిస్తున్నాడు.  గ్రీన్‌ వేసిన 15 ఓవర్‌లో వరుసగా రెండు సిక్స్‌లు బాదాడు. 

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా..
టీమిండియా రుతురాజ్‌ గైక్వాడ్‌ రూపంలో నాలుగో వికెట్‌ కోల్పోయింది. 32 పరుగులు చేసిన రుతురాజ్‌.. సంగా బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి జితేష్‌ శర్మ వచ్చాడు. 14 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 115/4

12 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 93/3
12 ఓవర్లకు టీమిండియా 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్‌ గైక్వాడ్‌(22), రింకూ సింగ్‌(18) పరుగులతో ఉన్నారు.

భారత్‌కు బిగ్‌ షాక్‌.. సూర్య ఔట్‌
టీమిండియా మరో వికెట్‌ కోల్పోయింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ కేవలం  ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. 9 ఓవర్లకు టీమిండియా స్కోర్‌: 70/3

రెండో  వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. 
63 పరుగుల వద్ద టీమిండియా రెండో వికెట్‌ కోల్పోయింది. 8 పరుగులు చేసిన శ్రేయస్‌ అయ్యర్‌.. సంగా బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

తొలి వికెట్‌ కోల్పోయిన టీమిండియా.. జైశ్వాల్‌ ఔట్‌
50 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్‌ కోల్పోయింది. 37 పరుగులు చేసిన యశస్వీ జైశ్వాల్‌.. హార్ధీ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి శ్రేయస్‌ అయ్యర్‌ వచ్చాడు. 7 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 55/1

5 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 43/0
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 5 ఓవర్లు ముగిసే సరికి 43 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్‌(32), రుతురాజ్‌ గైక్వాడ్‌(6) పరుగులతో ఉన్నారు.

2 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 12/0
2 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీ జైశ్వాల్‌(7), రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉన్నారు.

తొలి ఓవర్‌ మెయిడిన్‌..
కాగా ఆసీస్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను ఆరోన్ హార్డీ అద్బుతంగా ఆరంభించాడు. భారత ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసిన హార్డీ మెయిడిన్‌ చేశాడు. క్రీజులో యశస్వీ జైశ్వాల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌ ఉన్నారు.

రాయ్‌పూర్‌ వేదికగా నాలుగో టీ20లో ఆస్ట్రేలియా-భారత జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరు జట్లు తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌లో భారీగా మార్పులు చేశాయి. టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగగా.. ఆసీస్‌ ఏకంగా ఐదు మార్పులు చేసింది. భారత జట్టులోకి శ్రేయస్‌ అయ్యర్‌, ముఖేష్‌ ​కుమార్‌, దీపక్‌ చాహర్‌, జితేష్‌ శర్మ తుది జట్టులోకి వచ్చారు.

తుది జట్లు
ఆస్ట్రేలియా: జోష్ ఫిలిప్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, ఆరోన్ హార్డీ, టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మాథ్యూ వేడ్ (కెప్టెన్‌), బెన్ ద్వార్షుయిస్, క్రిస్ గ్రీన్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, తన్వీర్ సంఘా

భారత్‌ : యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్‌), జితేష్ శర్మ (వికెట్‌ కీపర్‌), రింకు సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, దీపక్ చాహర్, ముఖేష్ కుమార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement