భారత్‌కు మరో ఎదురుదెబ్బ: తొలి టెస్టు నుంచి అతడు అవుట్‌! | India Tour Of England 2021: Mayank Agarwal Out Of 1st Test Why | Sakshi
Sakshi News home page

Ind Vs Eng: సిరాజ్‌ బౌలింగ్‌.. మయాంక్‌ తలకు గాయం!

Aug 3 2021 1:22 PM | Updated on Aug 3 2021 1:44 PM

India Tour Of England 2021: Mayank Agarwal Out Of 1st Test Why - Sakshi

ఫొటో: బీసీసీఐ

లండన్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత టెస్టు జట్టు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ తలకు గాయమైంది. దాంతో ఇంగ్లండ్‌తో బుధవారం నుంచి ఆరంభమయ్యే తొలి టెస్టుకు దూరమయ్యాడు. సోమవారం జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో పేసర్‌ సిరాజ్‌ వేసిన షార్ట్‌ బాల్‌... బ్యాటింగ్‌ చేస్తోన్న మయాంక్‌ హెల్మెట్‌ను బలంగా తాకింది. తొలి టెస్టుకు మయాంక్‌ దూరమవ్వడంతో ఆగస్టు 4 నుంచి ఆరంభమయ్య మ్యాచ్‌లో రోహిత్‌ శర్మతో కలిసి కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఓపెనర్‌ గిల్, సుందర్, పేసర్‌ అవేశ్‌ ఖాన్‌ గాయాలతో సిరీస్‌కు దూరమయ్యారు.  

Advertisement
 
Advertisement
Advertisement