IND vs BAN: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. అక్షర్‌కు నో ఛాన్స్‌! ఆల్‌రౌండర్‌ అరంగేట్రం

India Playing XI 1st Test: Gill, KL Rahul to Open, Saurabh Kumar likely debut - Sakshi

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. ఇప్పుడు టెస్టు సిరీస్‌లో తలపడేందుకు సిద్దమైంది. ఛాటోగ్రామ్‌ వేదికగా బుధవారం(డిసెంబర్‌14) ఇరు జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ టెస్టు సిరీస్‌కు భారత రెగ్యూలర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా, పేసర్‌ మహ్మద్‌ షమీ గాయం కారణంగా దూరమయ్యారు.

వీరి స్థానంలో అభిమాన్యు ఈశ్వరన్‌, సౌరభ్‌ కుమార్‌, నవ్‌దీప్‌ సైనీను బీసీసీఐ ఎంపిక చేసింది. అదే విధంగా 12 ఏళ్ల తర్వాత పేసర్‌ జయదేవ్‌ ఉనద్కట్‌ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక ఈ సిరీస్‌లో భారత కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్‌ వ్యవహరించున్నాడు. ప్రస్తుతం ఛాటోగ్రామ్‌లో ఉన్న భారత ఆటగాళ్లు నెట్స్‌లో తీవ్రంగా చమటోడుస్తున్నారు.

సౌరభ్‌ కుమార్‌కు తుది జట్టులో ఛాన్స్‌
ఆల్‌రౌండర్‌ సౌరభ్‌ కుమార్‌ భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. బంగ్లాతో తొలి టెస్టుకు ఆల్‌రౌండర్‌ కోటాలో సౌరభ్‌ను తుది జట్టులోకి తీసుకోవాలని జట్టు  మేనేజెమెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్‌-'ఎ'తో అనధికార టెస్టు సిరీస్‌లో కూడా సౌరభ్‌ తన ఆల్‌ రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

ఇక రోహిత్‌ దూరం కావడంతో భారత ఇన్నింగ్స్‌ను శుబ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మిడిలార్డర్‌లో కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌కు చోటు దక్కనుంది. జట్టులో స్పెషలిస్టు స్పిన్నర్‌గా రవిచంద్రన్‌ అశ్విన్‌ ఉండనున్నాడు. అయితే మరో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ను తొలి టెస్టుకు పక్కన పెట్టే అవకాశం ఉంది. అక్షర్‌ స్థానంలో సౌరభ్‌ కుమార్‌ను తీసుకోనున్నట్లు సమాచారం. ఇక పేసర్ల కోటాలో శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్ చోటు దక్కే ఛాన్స్‌ ఉంది.
తొలి టెస్టుకు భారత తుది జట్టు(అంచనా): శుబ్‌మాన్ గిల్, కెఎల్ రాహుల్ (కెప్టెన్‌), చెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, సౌరబ్‌ కుమార్‌, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ సిరాజ్. ఉమేష్ యాదవ్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top