భారత జట్టుకు నిరాశ  | India lost on Germany in the semis | Sakshi
Sakshi News home page

భారత జట్టుకు నిరాశ 

Dec 15 2023 4:23 AM | Updated on Dec 15 2023 4:23 AM

India lost on Germany in the semis - Sakshi

కౌలాలంపూర్‌: మూడోసారి జూనియర్‌ పురుషుల ప్రపంచకప్‌ హాకీ టోర్నమెంట్‌ టైటిల్‌ సాధించాలనుకున్న భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన జర్మనీ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్‌ 1–4 గోల్స్‌ తేడాతో ఓడిపోయింది. భారత జట్టుకు సుదీప్‌ చిర్మాకో (11వ ని.లో) ఏకైక గోల్‌ అందించాడు.

జర్మనీ జట్టు తరఫున బెన్‌ హాస్‌బాష్‌ (8వ ని.లో, 30+వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... పాల్‌ గ్లాండర్‌ (41వ ని.లో), ఫ్లోరియన్‌ స్పెర్లింగ్‌ (58వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. ఈ గెలుపుతో జర్మనీ జట్టు తొమ్మిదోసారి ఈ మెగా ఈవెంట్‌లో టైటిల్‌ పోరుకు అర్హత సాధించింది. భారత జట్టుకు సెమీఫైనల్లో ఏకంగా 12 పెనాల్టీ కార్నర్‌లు వచ్చినా ఒక్క దానిని కూడా సద్వినియోగం చేసుకోకుండా మూల్యం చెల్లించుకుంది.  

Advertisement
 
Advertisement
Advertisement