ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. ఒత్తిడిలో భారత్‌ | IND W Vs AUS W 2nd ODI: India Looking To Amend Errors And Bounce Back Against Australia - Sakshi
Sakshi News home page

IND Vs AUS: ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. ఒత్తిడిలో భారత్‌

Published Sat, Dec 30 2023 7:10 AM

India looking to amend errors and bounce back against Australia - Sakshi

ముంబై: వన్డే సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన సమరానికి భారత మహిళల జట్టు సిద్ధమైంది. వాంఖేడె మైదానంలో శనివారం భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో వన్డే జరుగుతుంది. తొలి మ్యాచ్‌ను గెలిచిన ఆసీస్‌ 1–0తో ఆధిక్యంలో ఉండగా... తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం ఎలాగైనా  గెలవాలనే పట్టుదలతో ఉంది.

నిజానికి ఇదే వేదికపై జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ భారీస్కోరే చేసింది. కానీ బౌలింగ్‌ వైఫల్యంతో మూల్యం చెల్లించుకుంది. ఇప్పుడు లోపాలపై దృష్టి పెట్టిన టీమ్‌ మేనేజ్‌మెంట్‌ వీటిని అధిగమించి ఆ్రస్టేలియాను నిలువరించాలనే లక్ష్యంతో ఉంది. మధ్యాహ్నం 1.30 నుంచి జరిగే మ్యాచ్‌ ‘స్పోర్ట్స్‌–18’లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
చదవండిAus Vs Pak: అంతిమ విజయం మాదే.. హఫీజ్‌కు కౌంటర్‌ ఇచ్చిన కమిన్స్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement