భారత్‌ శుభారంభం

India is off to a good start - Sakshi

కువైట్‌ సిటీ: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌–2026 ఆసియా జోన్‌ రెండో రౌండ్‌ క్వాలిఫయింగ్‌ పోటీల్లో భారత్‌ శుభారంభం చేసింది. సునీల్‌ ఛెత్రి నాయకత్వంలోని భారత జట్టు 1–0 గోల్‌ తేడాతో కువైట్‌ జట్టును ఓడించింది. ఆట 75వ నిమిషంలో మాన్విర్‌ సింగ్‌ గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచింది. చివరిదాకా ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని 22 ఏళ్ల తర్వాత వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో విదేశీ గడ్డపై భారత్‌ తొలి విజయాన్ని ఖాయం చేసుకుంది.

ఈనెల 21న ఆసియా చాంపియన్‌ ఖతర్‌ జట్టుతో భారత్‌ రెండో మ్యాచ్‌ ఆడుతుంది. గ్రూప్‌ ‘ఎ’లో భారత్, ఖతర్, కువైట్, అఫ్గానిస్తాన్‌ జట్లున్నాయి. ఇంటా, బయట పద్ధతిలో జరిగే లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక గ్రూప్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు మూడో రౌండ్‌కు అర్హత పొందుతాయి. ఇప్పటి వరకు భారత జట్టు ప్రపంచకప్‌ క్వాలిఫయర్స్‌లో మూడో రౌండ్‌ కు అర్హత సాధించలేదు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top