పాక్‌ను చిత్తు చేసిన భారత్‌ | Sakshi
Sakshi News home page

SAFF Womens Football Championship 2022: పాక్‌ను చిత్తు చేసిన భారత్‌

Published Thu, Sep 8 2022 10:23 AM

India Beat Pakistan 3-0 In SAFF Womens Football Championship 2022 - Sakshi

కఠ్మాండు (నేపాల్‌): ఆరోసారి టైటిల్‌ సాధించాలనే లక్ష్యంతో దక్షిణాసియా మహిళల ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో (శాఫ్‌) బరిలోకి దిగిన భారత జట్టు శుభారంభం చేసింది. పాకిస్తాన్‌తో బుధవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 3–0 గోల్స్‌ తేడాతో ఘనవిజయం సాధించింది. భారత్‌ తరఫున డాంగ్మే గ్రేస్‌ (23వ ని.లో), తెలంగాణ అమ్మాయి సౌమ్య గుగులోత్‌ (90+4వ ని.లో) ఒక్కో గోల్‌ చేయగా... అంతకుముందు పాకిస్తాన్‌ జట్టు చేసిన సెల్ఫ్‌ గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచింది.  భారత్‌ తన తదుపరి మ్యాచ్‌లో ఈనెల 10న మాల్దీవులు జట్టుతో ఆడుతుంది. 

Advertisement
 
Advertisement
 
Advertisement