IND VS ENG 2nd ODI: లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో వన్డే సందర్భంగా టీమిండియా మాజీ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్‌లు సందడి చేశారు. ఈ టీమిండియా మాజీ త్రయం వీఐపీ గ్యాలరీలో ఫోటోలకు పోజులిస్తూ సందడి చేసింది. ఇటీవలి కాలంలో టీమిండియా ఎక్కడికి వెళ్లినా ఫాలో అవుతున్న ధోని.. తొలి వన్డే సందర్భంగా కూడా మైదానంలో హడావుడి చేశాడు. విండీస్ దిగ్గజం గార్డన్ గ్రీనిడ్జ్, సైఫ్ అలీ ఖాన్‌లతో కలిసి ఫోటోలు దిగాడు. తాజాగా తలా.. చిన్న తలా (రైనా)తో కలిసి దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
Great watching the boys in blue 🇮🇳 @harbhajan_singh @msdhoni pic.twitter.com/1UEGAzEG7R
— Suresh Raina🇮🇳 (@ImRaina) July 14, 2022
సహచరులు భజ్జీ, ధోనిలతో కలిసి దిగిన ఫోటోలను రైనా ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. కాగా, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ను వీక్షించేందుకు దిగ్గజ ఆటగాళ్లు చాలా మంది హాజరవుతున్నారు. తొలి వన్డే సందర్భంగా సచిన్, గంగూలీలతో పాటు చాలా మంది స్టార్లు మ్యాచ్‌ను లైవ్‌లో వీక్షించారు. ఇదిలా ఉంటే, రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో ఇంగ్లండ్ 246 పరుగులకే ఆలౌటైంది. చహల్ 4, బుమ్రా, హార్థిక్ తలో 2 వికెట్లు, ప్రసిద్ధ కృష్ణ, షమీ చెరో వికెట్ పడగొట్టారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో మొయిన్ అలీ (47) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 
చదవండి: విండీస్ దిగ్గజాల రికార్డుకు ఎసరు పెట్టిన రోహిత్-ధవన్ జోడీ

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
