ICC T20I Rankings: Virat Kohli Slips Out Of Top 10, SKY Retains Top Spot - Sakshi
Sakshi News home page

ICC T20I Rankings: సూర్య అగ్రస్థానం మరింత పదిలం.. దిగజారిన కోహ్లి ర్యాంక్‌

Nov 9 2022 2:15 PM | Updated on Nov 9 2022 3:07 PM

ICC T20I Rankings: Virat Kohli Slips Out Of Top 10 - Sakshi

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, కింగ్‌ కోహ్లి టాప్‌-10లో చోటు కోల్పోయాడు. టీ20 వరల్డ్‌కప్‌-2022లో 5 మ్యాచ్‌ల్లో 3 హాఫ్‌సెంచరీలతో సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లి గత వారమే చాలా గ్యాప్‌ తర్వాత టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో 653 రేటింగ్‌ పాయింట్స్‌తో 10వ స్థానంలో నిలిచిన కోహ్లి.. ఈ మధ్యలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 26 పరుగులకే ఔట్‌ కావడంతో, ఓ స్థానాన్ని కోల్పోయి 11 ప్లేస్‌కు పడిపోయాడు.

ఈ జాబితాలో మిస్టర్‌ 360 డిగ్రీస్‌ ప్లేయర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. మహ్మద్‌ రిజ్వాన్‌, డెవాన్‌ కాన్వే, బాబర్‌ ఆజమ్‌, ఎయిడెన్‌ మార్క్రమ్‌, డేవిడ్‌ మలాన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రిలీ రొస్సో, ఆరోన్‌ ఫించ్‌, పథుమ్‌ నిస్సంక వరుసగా రెండు నుంచి పది స్థానాల్లో నిలిచారు. ప్రస్తుత ప్రపంచకప్‌లో వరుస హాఫ్‌ సెంచరీలు బాది మళ్లీ టచ్‌లోకి వచ్చిన టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ 5 స్థానాలు ఎగబాకి 16వ స్థానంలో నిలిచాడు.

ఇక బౌలర్ల విషయానికొస్తే.. వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన లంక స్పిన్నర్‌ వనిం‍దు హసరంగ అగ్రపీఠానికి ఎగబాకాడు. మెగా టోర్నీలో 15 వికెట్లు పడగొట్టిన హసరంగ.. భారీగా రేటింగ్‌ పాయింట్లు పెంచుకుని టాప్‌ ప్లేస్‌కు చేరాడు. భారత బౌలర్లలో అశ్విన్‌ 5 స్థానాలు ఎగబాకి 13వ ప్లేస్‌కు చేరుకోగా.. వరల్డ్‌కప్‌లో అద్భుతంగా రాణించిన అర్షదీప్‌ నాలుగు స్థానాలు ఎగబాకి 23వ స్థానానికి చేరుకున్నాడు.  

Advertisement
 
Advertisement
Advertisement