టాప్‌–6లో నిలిచే జట్లు, ఇంగ్లండ్‌ నేరుగా అర్హత

ICC And Commonwealth Games Federation Announce Qualification Process For Womens Cricket - Sakshi

ఏప్రిల్‌ 1వ తేదీ ఐసీసీ ర్యాంకింగ్స్‌ కీలకం

2022 కామన్వెల్త్‌ గేమ్స్‌ మహిళల క్రికెట్‌

దుబాయ్‌: ప్రతిష్టాత్మక కామన్వెల్త్‌ క్రీడల్లో తొలిసారిగా సందడి చేయనున్న మహిళల క్రికెట్‌కు సంబంధించిన క్వాలిఫయింగ్‌ ప్రక్రియ వివరాలను అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ), కామన్వెల్త్‌ గేమ్స్‌ సమాఖ్య (సీజీఎఫ్‌) విడుదల చేశాయి. దీని ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్‌ 1వ తేదీ వరకు ఐసీసీ మహిళల టి20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో తొలి ఆరు స్థానాల్లో ఉన్న జట్లతో పాటు.... ఆతిథ్య దేశమైన ఇంగ్లండ్‌ నేరుగా ఈ పోటీలకు అర్హత సాధించనుంది. ప్రస్తుతం భారత మహిళల జట్టు మూడో ర్యాంక్‌లో ఉంది.

చివరిదైన ఎనిమిదో బెర్త్‌ను ‘కామన్వెల్త్‌ గేమ్స్‌ క్వాలిఫయర్‌ టోర్నీ’లో విజేత  జట్టుతో భర్తీ చేస్తారు. 2022లో ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్‌ వేదికగా జూలై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్‌ గేమ్స్‌ జరగనున్నాయి. ఓవరాల్‌గా కామన్వెల్త్‌ క్రీడల్లో క్రికెట్‌ పోటీలు భాగస్వామ్యం కావడం ఇది రెండో సారి మాత్రమే. 1998 కౌలాలంపూర్‌ క్రీడల్లో తొలిసారిగా పురుషుల క్రికెట్‌కు ఈ అవకాశం దక్కింది. అజయ్‌ జడేజా సారథ్యంలో ఈ క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు గ్రూప్‌ దశలోనే నిష్క్రమించింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top