అథ్లెట్‌ మహిళా కోచ్‌కు లైంగిక వేధింపులు.. క్రీడాశాఖ మంత్రి రాజీనామా!

Haryana Minister Quits Over Molested Case - Sakshi

హర్యానా రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి సందీప్‌సింగ్‌ తన పదవికి రాజీనామా చేశారు. జూనియర్‌ మహిళా అథ్లెటిక్స్‌ కోచ్‌ను లైంగికంగా వేధించినట్లు ఆరోపణలు రావడంతో సందీప్‌సింగ్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది తన ఇమేజ్‌ను చెడగొట్టేందుకే కొందరు చేస్తోన్న ప్రయత్నమని రాజీనామా చేసిన అనంతరం సందీప్‌సింగ్‌ అన్నారు. 

సందీప్‌సింగ్‌ మాట్లాడుతూ.. "నా ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం జరుగుతుందని నాకు సృష్టంగా తెలుసు. నాపై వచ్చిన తప్పుడు ఆరోపణలపై  క్షుణ్ణంగా దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది.  విచారణ నివేదిక వచ్చే వరకు ముఖ్యమంత్రికి క్రీడా శాఖ బాధ్యతలు అప్పగిస్తాను" అని అతను పేర్కొన్నాడు.

ఏం జరిగిందంటే?
గురువారం(డిసెంబర్‌ 29) ప్రతిపక్ష పార్టీ ఇండియన్ నేషనల్ లోక్ దళ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  క్రీడామంత్రి సందీప్ సింగ్ తనను లైంగికంగా వేధించాడంటూ  ఓ మహిళా కోచ్‌ ఆరోపణలు చేసింది. తనను తొలుత జిమ్ లో మంత్రి చూశాడని... ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్ లో తనకు మెసేజ్ లు పెట్టేవాడని, తనను కలవాలని ఒత్తిడి చేసేవాడని ఆమె పేర్కొంది.

ఈ క్రమంలోనే శుక్రవారం (డిసెంబర్‌ 30)  చండీగఢ్‌లో సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఎస్‌ఎస్‌పీ)ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం సెక్షన్లు 354, 354A, 354B, 342, 506 కింద క్రీడా మంత్రిపై పోలీసులు  కేసు నమోదు చేశారు. ఆమె చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలని  మంత్రి ఖండించారు. అయినప్పటికీ ప్రతిపక్షాల తీవ్ర ఒత్తడి చేయడంతో మంత్రి తన పదవికి విడ్కోలు పలికినట్లు తెలుస్తోంది. కాగా సందీప్‌సింగ్‌ గతంలో భారత హాకీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు.

చదవండి: పంత్‌ను కాపాడిన బస్సు డ్రైవర్‌కు సత్కారం.. ఎప్పుడంటే?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top