T20 WC: ఔటయ్యానన్న కోపంతో బ్యాట్‌ను నేలకేసి కొట్టిన టీమిండియా కెప్టెన్‌! వీడియో వైరల్‌

Harmanpreet Kaur Throws Away Her Bat In Frustration After Bizarre Run Out - Sakshi

మహిళల టీ20 ప్రపంచకప్‌-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీఫైనల్లో టీమిండియా పరాజాయం పాలైన సంగతి తెలిసిందే. కీలక మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఓటమి చవిచూసిన భారత్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరోవైపు ఆస్ట్రేలియా వరుసగా ఏడో సారి ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో 52 పరుగులు చేసింది. 

ఊహించని రీతిలో..
కాగా ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్‌ను దురుదృష్టం వెంటాడింది. కీలక సమయంలో ఊహించని రీతిలో హర్మన్‌ రనౌట్‌గా వెనుదిరిగింది. 15వ ఓవర్‌ వేసిన జార్జియా వేర్‌హామ్ బౌలింగ్‌లో మొదటి రెండు బంతులకు హర్మన్ ప్రీత్ కౌర్ రెండు ఫోర్లను బాదింది. ఈ క్రమంలో హర్మన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. 4వ బంతిని హర్మన్ డీప్ మిడి వికెట్ దిశలో స్వీప్ షాట్ ఆడింది. బంతి బౌండరీకి చేరుతుందనే క్రమంలో గార్డనర్‌ అద్భుతంగా ఫీల్డింగ్‌ చేస్తూ ఆపింది. అయితే సింగిల్‌ను ఇదే సమయంలో హర్మన్‌, రిచా రెండో పరుగు కోసం ప్రయత్నించారు.

అయితే  క్రీజును చేరుకునే క్రమంలో హర్మన్ బ్యాట్ కాస్త ముందు ఇరుక్కుపోయింది. వెంటనే బంతిని అందుకున్న వికెట్‌ కీప్‌ హీలీ బెయిల్స్‌ పడగొట్టడంతో హర్మన్‌ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరింది. దీంతో మ్యాచ్‌ ఒక్క సారిగా ఆసీస్‌ వైపు మలుపు తిరిగింది. ఇక అనూహ్యరీతిలో ఔటైన హర్మన్‌ అసహనానికి గురైంది. ఈ క్రమంలో డగౌట్ వైపు వెళ్తూ కోపంతో తన బ్యాట్‌ను నేలకేసి కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండిT20 WC: 'నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. అందుకే అలా చేశా'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top