
బతూమి (జార్జియా): మహిళల ప్రపంచకప్ చెస్ నాకౌట్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు, తెలుగు తేజాలు ద్రోణవల్లి హారిక, కోనేరు హంపి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. నందిత (భారత్)తో జరిగిన రెండో రౌండ్‌లో హారిక 1.5–0.5తో... హంపి 1.5–0.5తో అఫ్రూజా ఖామ్‌దమోవా (ఉజ్బెకిస్తాన్)పై గెలుపొందారు. గురువారం జరిగిన రెండో రౌండ్ రెండో గేమ్‌లో హారిక 37 ఎత్తుల్లో నందితను ఓడించగా... అఫ్రూజాతో గేమ్‌ను హంపి 44 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది.
బుధవారం జరిగిన తొలి గేమ్‌లో అఫ్రూజాపై హంపి నెగ్గగా... నందితతో గేమ్‌ను హారిక ‘డ్రా’ చేసుకుంది. భారత్‌కే చెందిన వైశాలి, దివ్య దేశ్‌ముఖ్ కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. మరో ముగ్గురు భారత ప్లేయర్లు వంతిక అగర్వాల్, పద్మిని రౌత్ మూడో రౌండ్‌లో చోటు కోసం నేడు టైబ్రేక్ గేమ్‌లు ఆడనున్నారు.