రైనా రిటైర్‌మెంట్‌ : షాక్‌లో సహచరులు | Harbhajan Singh Rohit Sharma Shocked By Suresh Raina Retirement | Sakshi
Sakshi News home page

రైనా రిటైర్‌మెంట్‌ : షాక్‌లో సహచరులు

Aug 16 2020 3:28 PM | Updated on Aug 16 2020 7:25 PM

Harbhajan Singh Rohit Sharma Shocked By Suresh Raina Retirement - Sakshi

ముంబై : భారత క్రికెట్‌ జట్టు మాజీ సారధి మహేంద్ర సింగ్‌ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు శనివారం రిటైర్‌మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ధోనీ రిటైర్‌మెంట్‌ ప్రకటన వెలువడిన కొద్ది నిమిషాలకే తాను కూడా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అవుతున్నట్లు సురేశ్‌ రైనా ప్రకటించారు. రైనా రిటైర్‌మెంట్‌ ప్రకటనపై సహచరులు హర్భజన్‌ సింగ్‌, రోహిత్‌ శర్మలు విచారం వ్యక్తం చేశారు. ఆదివారం వారు ట్విటర్‌ వేదికగా స్పందించారు.. ‘‘  సురేష్‌ రైనా రిటైర్‌మెంట్‌తో షాక్‌కు గురయ్యాను. రైనా! నీకు మంచి ఫిట్‌నెస్‌, వయసు ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌కు నీ అవసరం చాలా ఉందనుకుంటున్నాను. కానీ, రిటైర్‌మెంట్‌ ఇచ్చేశావు. నీ సెకండ్‌ ఇన్నింగ్స్‌కు ఆల్‌ ది బెస్ట్‌! ’’ అన్నారు హర్భజన్‌. ( రాముడి బాటలో లక్ష్మణుడు...)

‘‘కొద్దిగా షాక్‌ తిన్నాను! కానీ, రిటైర్‌మెంట్‌ తీసుకోవాలనుకున్నావు, తీసుకున్నావు. మంచి కెరీర్‌, గొప్ప రిటైర్‌మెంట్‌ అవ్వాలి. మనం రంగంలోకి దిగిన రోజు నాకింకా గుర్తే! నువ్వు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నా’’ అని పేర్కొన్నారు రోహిత్‌ శర్మ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement