టీమిండియా ఓపెనర్‌గా అతడు వద్దు: గౌతం గంభీర్‌

Gambhir dismisses suggestions of Virat Kohli opening the batting - Sakshi

టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ఆసియాకప్-2022తో తిరిగి గాడిలో పడ్డాడు. ఆసియాకప్‌లో భాగంగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ సాధించిన విరాట్‌.. తనపై వచ్చిన విమర్శలకు చెక్‌ పెట్టాడు. అదే విధంగా దాదాపు 1000 రోజుల తర్వాత తన 71వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు.  కాగా ఈ మ్యాచ్‌​కు రోహిత్‌ శర్మ దూరం కావడంతో ఓపెనర్‌ వచ్చిన కింగ్‌ కోహ్లి.. దుమ్మురేపాడు.

ఈ మ్యాచ్‌లో ఏకంగా 122 పరుగులు సాధించి ఆజేయం నిలిచాడు. దీంతో టీ20ల్లో భారత ఓపెనర్‌గా కోహ్లిని పంపించాలని మాజీలు, క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే టీమిండియా మాజీ ఆటగాడు గౌతం గంభీర్‌ మాత్రం కోహ్లిని ఓపెనర్‌గా పంపాలన్న చర్చలను కొట్టిపారేశాడు. విరాట్‌కు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మూడో స్థానమే సరైనది అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

స్టార్‌ స్పోర్ట్స్‌ షో 'గేమ్‌ప్లాన్‌'లో భాగంగా గంభీర్‌ మాట్లాడుతూ.. "విరాట్‌ కోహ్లి భారత బ్యాకప్‌ ఓపెనర్‌ మాత్రమే. కోహ్లిని ఓపెనర్‌గా పంపించాలన్న కొత్త చర్చలను ప్రారంభించవద్దు. జట్టులో కేఎల్‌ రాహుల్‌, రోహిత్ శర్మ ఉంటే విరాట్‌కు ఓపెనర్‌గా ఛాన్స్‌ రాదు. అతడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే సరిపోతుంది.

ఒక వేళ ఓపెనర్‌లు 10 ఓవరర్‌ వరకు బ్యాటింగ్‌ చేస్తే.. అప్పుడు మూడో స్థానంలో కోహ్లికి బదులుగా సూర్యకుమార్ యాదవ్‌ను పంపించాలి. సూర్య దూకుడుగా ఆడి స్కోర్‌ బోర్డును మరింత పరుగులు పెట్టిస్తాడు" అని పేర్కొన్నాడు.
చదవండి: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. మొహాలీకి చేరుకున్న భారత ఆటగాళ్లు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top