Shane Warne: వార్న్‌ను బతికించడానికి 20 నిమిషాలు కష్టపడ్డారు.. అయినా కానీ

Friends 'battled for 20 mins' to try and save Australian legend - Sakshi

ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్‌ వార్న్‌ ఆకాల మరణంతో  క్రీడా లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. థాయిలాండ్‌లోని కోహ్ సమీయులో తన విల్లాలో  గుండెపోటుతో వార్న్‌ మృతి చెందిన  విష‌యం విదిత‌మే. ఈ నేపథ్యంలో వార్న్‌ మృతికి సంబంధించి ఓ వార్త బయటకు వచ్చింది. షేన్ వార్న్‌ను బతికించడానికి తన ముగ్గురు స్నేహితులు విశ్వప్రయత్నాలు చేశారని థాయ్‌లాండ్‌ పోలీసులు తెలిపారు. వార్న్‌ తన ముగ్గురు స్నేహితులతో కలిసి థాయిలాండ్‌లోని కోహ్ సమీయులోని విల్లాలో ఉంటున్నారని, వార్న్‌ డిన్నర్‌కు రాకపోవడంతో స్నేహితుడు వెళ్లి చూసే సరికి వార్న్‌ విగిత జీవిగా పడి ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

"వార్న్‌కు తన స్నేహితుడు సీపీఆర్‌ చేశాడు. వెంటనే  అంబులెన్స్‌కు కాల్‌ చేశారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్ యూనిట్ వచ్చి 10-20 నిమిషాల పాటు మరో సీపీఆర్‌ చేసింది. తరువాత థాయ్ ఇంటర్నేషనల్ హాస్పిటల్ నుంచి అంబులెన్స్ వచ్చి అతన్ని తీసుకువెళ్లింది. హాస్పిటల్ వెళ్లాక ఐదు నిమిషాలు సీపీఆర్‌  చేశారు. అయినప్పటికీ ఫలితం లేదని, అతడు మరణించాడు" అని థాయ్ పోలీసు అధికారి ఒకరు  పేర్కొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: Shane Warne: మా గుండె ప‌గిలింది.. మాట‌లు రావ‌డం లేదు: రాజ‌స్తాన్ రాయ‌ల్స్ భావోద్వేగం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top