వెంటిలేటర్‌పై మాజీ క్రికెటర్‌

Former Indian Cricketer Chetan Chauhan On Ventilator After Testing Positive - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్‌ మంత్రి, మాజీ  టీమిండియా క్రికెటర్‌ చేతన్‌ చౌహాన్‌ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. కిడ్ని సమస్యతో పోరాడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. చేతన్‌ చౌహాన్‌ జూలైలో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.  దీంతో ఆయన్ని లక్నోలోని సంజయ్‌ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో మెదంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్‌ చికిత్స పొందుతున్న ఆయనకి కిడ్నీ, బీపీ సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్‌పై ఆత్యవసర చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. (కోవిడ్‌ లెక్కలు చెప్పే అగర్వాల్‌కు కరోనా)

రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన చేతన్‌ చౌహాన్‌ కరోనా బారిన పడిన అంతర్జాతీయ మాజీ క్రికెట్‌ క్రీడాకారుల్లో ఒకరు. చేతన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన కుటుంబసభ్యులు జూలైలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, హోం క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ప్రస్తుతం చౌహాన్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కేబినెట్‌లో మంత్రిగా ఉన్నారు. 1969-1978 మధ్య కాలంలో ఆయన 40 టెస్టులు ఆడి 31.57 సగటుతో 2084 పరుగులు చేశారు. 97 పరుగుల అత్యధిక స్కోరు కలిగి ఉన్నారు. ఏడు వన్డేలు ఆడిన చౌహాన్ ‌153 పరుగులు చేశారు. (దేశ భద్రతలో మరో కీలక ఆవిష్కరణ)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top