మోదీ ప్రసంగం.. మేడ్‌ ఇన్‌ ఇండియా లేజర్‌తో భద్రత

Made In India Laser Weapon Scanned Sky For Drones During PM Address - Sakshi

న్యూఢిల్లీ: 74 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా శనివారం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) అభివృద్ధి చేసిన యాంటీ డ్రోన్ వ్యవస్థను ఎర్ర కోట సమీపంలో శనివారం మోహరించారు అధికారులు. ఈ లేజర్‌ వెపన్‌ ఆకాశంలో 3 కిలోమీటర్ల పరిధిలోని డ్రోన్‌లను గుర్తించడమే కాక జామ్‌ చేయగలదు. అలానే 1-2.5 కిలోమీటర్ల దూరంలోని లేజర్‌ వెపన్‌ టార్గెట్‌లను వాటేజ్‌ను బట్టి చేధించగలదని అధికారులు తెలిపారు. దేశంలోని పశ్చిమ, ఉత్తర భాగాలలో పెరిగిన డ్రోన్ ఆధారిత కార్యకలాపాలకు ఇది తగిన సమాధానం అవుతుందని భావిస్తున్నామన్నారు అధికారులు. 74వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన సమరయోధులను గుర్తు చేసుకుని వారికి నివాళులు ఆర్పించారు.

‘ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భారత మాత స్వాతంత్ర్యం కోసం పోరాడిన లక్షలాది మంది కుమారులకు, కుమార్తెలకు మా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మనందరం స్వతంత్ర భారతంలో స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నాం అంటే వారి ప్రాణత్యాగ ఫలితమే. వారి త్యాగాలను మనం స్మరించుకోవాలి. అలానే మా భద్రత కోసం ఆర్మీ, పారా మిలిటరీ, పోలీసులతో సహా ఇతర భద్రతా సిబ్బంది ఎంతో కష్టపడుతున్నారు. వారికి కృతజ్ఞతలు తెలిపే రోజు ఇది’ అన్నారు నరేంద్ర మోదీ. అలానే స్వాతంత్ర్య సమరయోధుడు, ఆధ్యాత్మిక గురువు శ్రీ అరబిందో (అరవింద్ ఘోష్) ను ఆయన జయంతి సందర్భంగా ప్రధాని జ్ఞాపకం చేసుకున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top