రూడ్‌కు చుక్కెదురు | The fifth seed lost in the second round | Sakshi
Sakshi News home page

రూడ్‌కు చుక్కెదురు

Sep 1 2023 2:40 AM | Updated on Sep 1 2023 2:40 AM

The fifth seed lost in the second round - Sakshi

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టెన్నిస్‌ టోర్నీలో గురువారం సంచలన ఫలితాలు నమోదయ్యాయి. పురుషుల సింగిల్స్‌లో గత ఏడాది రన్నరప్, ఐదో సీడ్‌ కాస్పర్‌ రూడ్‌ (నార్వే), ఏడో సీడ్‌ సిట్సిపాస్‌ (గ్రీస్‌) రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు.

ప్రపంచ 67వ ర్యాంకర్‌ జీజెన్‌ జాంగ్‌ (చైనా) 3 గంటల 19 నిమిషాల్లో 6–4, 5–7, 6–2, 0–6, 6–2తో రూడ్‌ను ఓడించగా... ప్రపంచ 128వ ర్యాంకర్‌ డొమినిక్‌ స్ట్రికర్‌ (స్విట్జర్లాండ్‌) 4 గంటల 4 నిమిషాల్లో 7–5, 6–7 (2/7), 6–7 (5/7), 7–6 (8/6), 6–3తో సిట్సిపాస్‌పై సంచలన విజయం సాధించాడు.

మరో మ్యాచ్‌లో రెండో సీడ్‌ జొకోవిచ్‌ (సెర్బియా) 6–4, 6–1, 6–1తో మిరాలెస్‌ (స్పెయిన్‌)పై నెగ్గి మూడో రౌండ్‌కు చేరాడు. మహిళల సింగిల్స్‌లో మాజీ నంబర్‌వన్‌ వొజ్నియాకి (డెన్మార్క్‌) 7–5, 7–6 (7/5)తో 11వ సీడ్‌ క్విటోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై, టాప్‌ సీడ్‌ స్వియాటెక్‌ (పోలాండ్‌) 6–3, 6–4తో దరియా సావిల్లె (ఆ్రస్టేలియా)పై గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించారు. 

పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో రోహన్‌ బోపన్న (భారత్‌)–మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా) జోడీ 6–4, 6–2తో క్రిస్టోఫర్‌ ఒకానెల్‌–వుకిచ్‌ (ఆ్రస్టేలియా) జంటను ఓడించగా... సాకేత్‌ మైనేని (భారత్‌)–కరత్‌సెవ్‌ (రష్యా) ద్వయం 7–6 (7/4), 3–6, 2–6తో హుస్లెర్‌ (స్విట్జర్లాండ్‌)–లాస్లో జెరె (సెర్బియా) జోడీ చేతిలో ఓటమి పాలైంది.   

Advertisement
 
Advertisement
Advertisement