Fans Baffled At Team India's Pace Attack For West Indies T20Is - Sakshi
Sakshi News home page

IND vs WI: మీకు ఓవరాక్షన్‌ స్టారే దొరికాడా.. చెత్త సెలక్షన్‌! వాళ్లు ఉండాల్సింది!

Jul 6 2023 10:31 AM | Updated on Jul 6 2023 10:40 AM

Fans Baffled At Team Indias Pace Attack For West Indies T20Is - Sakshi

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించింది. ఈ జట్టుకు స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా సారథ్యం వహించనున్నాయి. అయితే విండీస్‌ సిరీస్‌కు సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసిన జట్టుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ముఖ్యంగా ఫామ్‌లో లేని ఫాస్ట్‌ బౌలర్‌ అవేష్‌ ఖాన్‌ను ఎంపిక చేయడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. అదే విధంగా ఐపీఎల్‌లో అదరగొట్టిన కేకేఆర్‌ ఆటగాడు రింకూ సింగ్‌ను కూడా సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. దీనిపై కూడా చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇక అవేష్‌ ఖాన్‌ విషయానికి వస్తే.. గత కొంతకాలంగా పేలవ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో కూడా అవేష్‌ ఖాన్‌ దారుణంగా నిరాశపరిచాడు. ఐపీఎల్‌-2023లో 9 మ్యాచ్‌లు ఆడిన అవేష్‌.. 9.75 ఏకానమితో 9 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా జాతీయ జట్టు తరపున వచ్చిన అవకాశాలు కూడా అందుపోచ్చుకోలేకపోయాడు. గతేడాది భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన అవేష్‌ ఖాన్‌.. పెద్దగా రాణించకపోవడంతో జట్టులో చోటు కోల్పోయాడు. దాదాపు అతడు ఏడాది నుంచి జట్టుకు దూరంగా ఉన్నాడు.

ఈ క్రమంలో అనూహ్యంగా సెలక్టర్లు అతడికి పిలుపునివ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అతడి స్ధానంలో ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన తుషార్‌ దేశ్‌ పాండే లేదా ఆకాష్‌ మధ్వాల్‌ అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది పలువురు ప్రాయపడుతున్నారు. ఓ యూజర్‌ స్పందిస్తూ.. మీకు ఈ ఓవరాక్షన్‌ స్టారే దొరికాడా అంటూ సెలక్టర్లు ఉద్దేశించి పోస్ట్‌ చేశాడు. 

అవేష్‌ ఓవరాక్షన్‌..
ఐపీఎల్‌-2023లో భాగంగా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో తొలిసారి తలపడిన మ్యాచ్‌లో లక్నో అనూహ్య రీతిలో విజయం సాధించింది. ఓటమి తప్పదు అనుకున్న తరుణంలో ఆఖరి బంతికి బై రూపంలో పరుగు రావడంతో లక్నో జయకేతనం ఎగురవేసింది. ఈ సమయంలో  క్రీజులో ఉన్న ఆవేశ్‌ ఖాన్‌ ఓవర్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

హెల్మెట్‌ తీసి నేలకేసి కొట్టి దూకుడు ప్రదర్శించాడు. దీంతో ఆవేశ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో అతడిని దారుణంగా ట్రోల్‌ చేశారు. ఇక  ఇప్పటివరకు టీమిండియా తరపున ఐదు వన్డేలు, 15 టీ20లు ఆడిన అవేష్‌ ఖాన్‌ వరుసగా 3, 13 వికెట్లు పడగొట్టాడు. 
చదవండి: తండ్రి కష్టం ఊరికే పోలేదు.. టీమిండియాకు ఎంపికైన తెలుగు కుర్రాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement