T20 WC 2022: బాబర్‌ చేసిన తప్పు అదే.. అందుకే పాకిస్తాన్‌ ఓడిపోయింది! లేదంటే

Ex Salman Butt Pakistan Batter Slams Star For Poor Captaincy - Sakshi

టీ20 ప్రపంచకప్‌-2022 ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో పాకిస్తాన్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీంతో రెండో సారి ఛాంపియన్స్‌గా నిలవాలన్న పాక్‌ కల నేరవేరలేదు. కాగా ఫైనల్లో ఆఫ్రిది స్థానంలో ఇఫ్తికర్‌ ఆహ్మద్‌ను బౌలింగ్‌ చేయంచడాన్ని పాక్‌ మాజీ కెప్టెన్‌ సల్మాన్‌ భట్‌ తప్పుబట్టాడు.
ఏం జరిగిందంటే
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో 16 ఓవర్‌ వేయడానికి వచ్చిన పాక్‌ పేసర్‌ షాహీన్‌ ఆఫ్రిది గాయం కారణంగా కేవలం ఒక్క బంతి మాత్రమే వేసి ఫీల్డ్‌ను వీడాడు. దీంతో ఆ ఓవర్‌లో మిగిలిన ఐదు బంతులను ఇఫ్తికర్‌ ఆహ్మద్‌తో బాబర్‌ బౌలింగ్‌ చేయించాడు.

అయితే ఈ ఐదు బంతుల్లో ఇఫ్తికర్‌ 13 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో ఒక్క సారిగా మ్యాచ్‌ ఇంగ్లండ్‌ వైపు మలుపు తిరిగింది. అనంతరం పాకిస్తాన్‌కు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా ఇంగ్లండ్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. అయితే ఐదు బంతులను నవాజ్‌తో పూర్తి చేసి ఉంటే బాగుండేది అని సల్మాన్‌ బట్‌ అభిప్రాయపడ్డాడు.

బాబర్‌ చేసిన తప్పు అదే
"ఈ మ్యాచ్‌లో షాహీన్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఆరంభంలోనే ఫామ్‌లో ఉన్న హేల్స్‌ వికెట్‌ పడగొట్టాడు. అయినప్పటికీ పవర్‌ప్లేలో  ఐదో ఓవర్ ఆఫ్రిదికి ఎందుకు ఇవ్వలేదో నాకు ఇప్పటికీ ఆర్ధం కాలేదు. ఆ సమయంలో బంతి అద్భుతంగా స్పింగ్‌ అవుతోంది. అటువంటి సమయంలో బాబర్‌.. షహీన్‌,  నసీమ్ షాతో వరుస ఓవర్లు ‍బౌలింగ్‌ చేయాల్సింది.

ఎందుకంటే బంతి స్వింగ్‌తో పాటు ఇంగ్లండ్‌ కూడా ఒత్తడిలో ఉంది. అప్పుడు షాదాబ్ ఖాన్‌తో బాబర్‌ బౌలింగ్‌ వేయించాడు. ఈ నిర్ణయం ఇంగ్లండ్‌ బ్యాటర్లపై ఎటువంటి ప్రభావం చూపలేదు. షాహీన్‌ తన సెకెండ్‌ స్పెల్‌ కోటాను గాయం కారణంగా పూర్తి చేయలేకపోయాడు. బెన్ స్టోక్స్ క్రీజులో ఉన్నాడు కాబట్టి  ఆఫ్రిది ఓవర్‌ పూర్తి చేయంచడానికి బాబర్‌ ఇఫ్తికర్ అహ్మద్‌ని తీసుకువచ్చాడు.

అది కచ్చితంగా సరైన నిర్ణయం కాదు. మహ్మద్ నవాజ్ పాకిస్తాన్ ప్రధాన బౌలర్. అతడితో ఓవర్‌ పూర్తి చేయాల్సింది. కానీ బాబర్‌ అలా చేయలేదు. ఆ ఒక్క ఓవర్‌తో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది" అని యూట్యూబ్‌ ఛానల్‌లో సల్మాన్‌ భట్‌ పేర్కొన్నాడు.
చదవండిIRE vs PAK: పాకిస్తాన్‌కు ఘోర పరాభవం.. చిత్తు చేసిన ఐర్లాండ్‌! సిరీస్‌ సొంతం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top