IND-W vs ENG-W: భారత్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

English skipper Nat Sciver to miss India series owing to mental health - Sakshi

స్వదేశంలో భారత మహిళలతో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌, స్టాండింగ్‌ కెప్టెన్‌ నాట్ స్కివర్ టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు కూడా దూరమైంది. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా స్కివర్‌ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పటికే రెగ్యులర్‌ కెప్టెన్‌ హీథర్ నైట్ గాయం కారణంగా భారత్‌ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నైట్ స్థానంలో స్కివర్‌కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు అప్పగించింది. తాజాగా స్కివర్‌ కూడా తప్పుకోవడంతో ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి.

ఇక స్కివర్‌ స్థానంలో ఇంగ్లీష్ జట్టుకు కెప్టెన్‌గా వికెట్‌ కీపర్‌ అమీ జోన్స్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఇక ఇంగ్లండ్‌ పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. చెస్టర్‌ లీ స్ట్రీట్‌ వేదికగా శనివారం జరగనున్న తొలి టీ20తో భారత్‌ టూర్‌ ప్రారంభం కానుంది.

ఇంగ్లండ్ జట్టు: లారెన్ బెల్, మైయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, కేట్ క్రాస్, ఫ్రెయా డేవిస్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, అమీ జోన్స్ (కెప్టెన్‌), ఫ్రెయా కెంప్, బ్రయోనీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వ్యాట్

భారత జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్‌), పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, తనియా భాటియా(వికెట్‌ కీపర్‌), స్నేహ రాణా, రాధా యాదవ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్, సబ్బినేని మేఘనా, సబ్బినేని మేఘనా హేమలత, రిచా ఘోష్, సిమ్రాన్ బహదూర్, కిరణ్ నవ్‌గిరే
చదవండి: Asia Cup 2022: 'కెప్టెన్‌ రిజ్వాన్‌ కాదు.. నేను'.. అంపైర్‌పై బాబర్‌ ఆజాం ఆగ్రహం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top