Eng Vs NZ Test Series: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. వెరీ స్పెషల్.. వాళ్లిద్దరికీ చోటు!

England Vs New Zealand Test Series 2022: న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. తొలి రెండు మ్యాచ్‌లలో కివీస్‌తో తలపడబోయే జట్టులో 13 మందికి స్థానం కల్పించినట్లు తెలిపింది. కాగా మూడు టెస్టు మ్యాచ్‌ల కోసం న్యూజిలాండ్ ఈ ఏడాది జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది.
ఇక టెస్టు కెప్టెన్‌గా బెన్ స్టోక్స్ పగ్గాలు చేపట్టిన తర్వాత ఇదే మొదటి సిరీస్ కావడం విశేషం. అదే విధంగా కోచ్‌గా బ్రెండన్ మెకల్లమ్‌కు కూడా ఇదే తొలి సిరీస్.. అది కూడా సొంతజట్టుపై కావడం మరో విశేషం. ఇక ఈ సిరీస్‌తో జేమ్స్ ఆండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తిరిగి జట్టులోకి రానున్నారు. ఇక దేశవాళీ క్రికెట్‌లో అదరగొడుతున్న హారీ బ్రూక్, మాథ్యూ పాట్స్ అరంగేట్రం చేయనున్నారు.
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లండ్ ప్రకటించిన 13 మంది సభ్యుల జట్టు:
బెన్ స్టోక్స్(కెప్టెన్), జో రూట్, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో, స్టువర్ట్ బ్రాడ్, హారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, అలెక్స్ లీస్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ పోప్, మాథ్యూ పాట్స్.
ఇంగ్లండ్ వర్సెస్ న్యూజిలాండ్ షెడ్యూల్:
జూన్ 02- 06 తొలి టెస్టు: లార్డ్స్ మైదానం
జూన్ 10-14 రెండో టెస్టు: ట్రెంట్ బ్రిడ్జ్
జూన్ 23- 27 మూడో టెస్టు: హెడ్డింగ్లీ, లీడ్స్
చదవండి👉🏾Kane Williamson: సన్‌రైజర్స్‌కు భారీ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్
చదవండి👉🏾Zubayr Hamza: సౌతాఫ్రికా బ్యాటర్‌పై ఐసీసీ నిషేధం
సంబంధిత వార్తలు