హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడి ఇంట్లో ఈడీ సోదాలు

Enforcement Directorate Raids On Hyderabad Cricket Association Former President Gaddam Vinod - Sakshi

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)  మాజీ అధ్యక్షుడు, బెల్లంపల్లి కాంగ్రెస్‌ అభ్యర్ధి జి వినోద్‌ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వినోద్‌తో పాటు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత మాజీ క్రికెటర్‌ శివలాల్ యాదవ్, హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు అర్షద్ అయూబ్‌ల ఇళ్లలో కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఉప్పల్ స్టేడియం నిర్మాణంలో అవినీతికి సంబంధించి తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో (TACB) దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్ల ఆధారంగా తనిఖీలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. మంగళవారం వినోద్‌ సోదరుడు, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి నివాసంలోనూ ఈడీ సోదాలు జరిపింది. వివేక్‌ కంపెనీ ఖాతాల్లో అక్రమ లావాదేవీలు జరిగాయన్న ఫిర్యాదు నేపథ్యంలో ఈడీ తనిఖీలు చేపట్టింది. వివేక్‌, వినోద్‌ దివంగత కాంగ్రెస్‌ నేత వెంకటస్వామి (కాకా) కుమారులు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top