ధృవ్‌ జురెల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ | Duleep Trophy 2024: Dhruv Jurel Takes Stunning Catch Of Musheer Khan In Second Innings | Sakshi
Sakshi News home page

ధృవ్‌ జురెల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌

Published Sat, Sep 7 2024 7:18 PM | Last Updated on Sun, Sep 8 2024 12:09 PM

Duleep Trophy 2024: Dhruv Jurel Takes Stunning Catch Of Musheer Khan In Second Innings

బెంగళూరు వేదికగా ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియా-బి వికెట్‌కీపర్‌ ధృవ్‌ జురెల్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ పట్టుకున్నాడు. ఆకాశ్‌దీప్‌ బౌలింగ్‌ ముషీర్‌ ఖాన్‌ లెగ్‌ సైడ్‌ దిశగా ఆడిన షాట్‌ను జురెల్‌ నమ్మశక్యం కాని రీతిలో అద్భుత క్యాచ్‌గా మలిచాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. 

ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో జురెల్‌ మొత్తం ఐదు క్యాచ్‌లు పట్టాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా-బి సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 240 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. 

ఇండియా-బి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్‌ (9), అభిమన్యు ఈశ్వరన్‌ (4), ముషీర్‌ ఖాన్‌ (0), నితీశ్‌ రెడ్డి విఫలం కాగా.. సర్ఫరాజ్‌ ఖాన్‌ (46), రిషబ్‌ పంత్‌ (61) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వాషింగ్టన్‌ సుందర్‌ (6) క్రీజ్‌లో ఉన్నాడు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్‌, ఖలీల్‌ అహ్మద్‌ తలో 2, ఆవేశ్‌ ఖాన్‌, తనుశ్‌ కోటియన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అంతకుముందు ఇండియా-ఏ తొలి ఇన్నింగ్స్‌లో 231 పరుగులకు ఆలౌటైంది. మయాంక్‌ అగర్వాల్‌ (36), శుభ్‌మన్‌ గిల్‌ (25), రియాన్‌ పరాగ్‌ (30), కేఎల్‌ రాహుల్‌ (37), తనుశ్‌ కోటియన్‌కు (32) మంచి ఆరంభాలు లభించినా భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ఇండియా-బి బౌలర్లలో ముకేశ్‌ కుమార్‌ (3/62), నవ్‌దీప్‌ సైనీ (3/60), సాయికిషోర్‌ (2/10), యశ్‌ దయాల్‌ (1/39), వాషింగ్టన్‌ సుందర్‌ (1/15) సత్తా చాటారు.

ముషీర్‌ భారీ శతకం..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇండియా-బి.. ముషీర్‌ ఖాన్‌ (181) భారీ శతకంతో చెలరేగడంతో 321 పరుగులు చేసింది. 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన ఇండియా-బిను దశలో ముషీర్‌, సైనీ (56) ఆదుకున్నారు. ఇండియా-ఏ బౌలర్లలో ఆకాశ్‌దీప్‌ 4, ఖలీల్‌ అహ్మద్‌, ఆవేశ్‌ ఖాన్‌ తలో 2, కుల్దీప్‌ యాదవ్‌ ఓ వికెట్‌ పడగొట్టారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement