IPL 2023, RCB Vs RR: Faf Du Plessis And Glenn Maxwell Put On 127 Runs For The Third Wicket Against The Rajasthan Royals - Sakshi
Sakshi News home page

తమ రికార్డును తామే బద్దలు కొట్టిన మ్యాక్స్‌వెల్‌-డుప్లెసిస్‌

Apr 23 2023 8:21 PM | Updated on Apr 24 2023 11:07 AM

Du Plesis-Glenn Maxwell Break Their Own Record-127 Runs 3rd Wicket Vs RR - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ మరో విజయాన్నినమోదు చేసింది. ఆదివారం రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. కాగా ఈ మ్యాచ్‌లో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ హిస్టరీలో థర్డ్ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా రికార్డు సృష్టించాడు.

అంతేకాకుండా తము క్రియేట్ చేసిన రికార్డును 6 రోజుల్లోనే బ్రేక్ చేయడం గమనార్హం. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఇద్దరూ మూడో వికెట్‌కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకు 6 రోజుల ముందు ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 126 పరుగులతో పాట్నర్‌షిప్‌తో అదరగొట్టారు.

2017లో గుజరాత్ లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ-కేఎల్ రాహుల్ ఇద్దరూ మూడో వికెట్‌కు అత్యధిక పరుగులు జోడించగా.. చెన్నైతో మ్యాచ్‌లో డుప్లెసిస్(62), మ్యాక్సీ(77) ఆ రికార్డును బ్రేక్ చేశారు. తాజాగా తమ రికార్డును మళ్లీ తామే బద్దలు కొట్టారు. డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ క్రియేట్ చేసిన ఈ 127 పరుగుల భాగస్వామ్యం ఐపీఎల్‌ హిస్టరీలో 15వ అత్యుత్తమ భాగస్వామ్యంగా నిలిచింది. మూడో వికెట్‌కు మాత్రం ఇదే అత్యుత్తమం.

ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్ మరో అరుదైన ఘనతను కూడా సాధించాడు. టి20 క్రికెట్‌లో 9 వేల పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ 2023లో ఇప్పటికే నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన డుప్లీ.. తాజాగా ఐదో అర్ధశతకాన్ని అందుకున్నాడు. పలితంగా పొట్టి ఫార్మాట్‌లో 9వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement